యోయో హనీ సింగ్ (ఫైల్ ఫోటో)
ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో 'గృహ హింస నుంచి మహిళల రక్షణ' చట్టం కింద మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేయబడింది. ఈ క్రమంలో కోర్టు హనీ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది.
ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాల్సిందిగా ఆదేశించింది. హనీ సింగ్, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలు లేకుండా.. షాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దాదాపు ఏడేళ్ల క్రితం అనగా 2014లో ‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్యను జనాలకు పరిచయం చేశాడు. బాలీవుడ్‌లోని పలు భారీ ప్రాజెక్ట్స్‌లో పని చేయడానికి ముందే హనీ సింగ్ వివాహం అయిందని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు.
ఇక దీపికా పదుకోనె, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన ‘కాక్‌టెయిల్’ చిత్రంలోని ఆంగ్రేజీ బీట్ పాటతో హనీ సింగ్ బాగా ప్రాచుర‍్యం పొందారు. ఈ పాట సూపర్ హిట్ అవ్వడమే కాకా 2011లో టాప్ సాంగ్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హనీ సింగ్ బాలీవుడ్ కెరీర్ సాఫీగా కొనసాగుతుంది. ఇక భార్య ఇచ్చిన ఫిర్యాదులతో అతడి కెరీర్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. భార్య ఫిర్యాదు మీద హనీ సింగ్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment