లాటరీ చరిత్రలోనే అదొక సంచలనం. కనివినీ ఎరుగని రీతిలో లాటరీ ప్రైజ్ దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. ఎంతో తెలుసా? మన కరెన్సీలో అక్షరాల పదహారున్నర వేల కోట్ల రూపాయలకు పైనే.
అమెరికా లాటరీ గేమ్ పవర్‌బాల్‌లో.. కాలిఫోర్నియాకి చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెల్చుకున్నాడు. ఆ విజేత ఎవరనే విషయాన్ని కాలిఫోర్నియా లాటరీ అధికారులు ఎట్టకేలకు చెప్పారు. ఆ వ్యక్తి పేరు ఎడ్విన్ కాస్ట్రో అంట. కానీ, అతనికి సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడించలేదు అధికారులు. నవంబర్ నెలలో పవర్‌బాల్ జాక్‌పాట్ అతనికి దక్కగా.. తద్వారా చరిత్రలోనే కనివిని ఎరుగని లాటరీ ప్రైజ్‌మనినీ దక్కించుకున్నాడతను.
కాలిఫోర్నియా చట్టాల ప్రకారం.. విజేత వివరాలను వెల్లడించొచ్చు. కానీ, అందులో కొన్ని కండిషన్లు ఉన్నాయి. పేరు చెప్పొచ్చు. ఆ టికెట్‌ను ఎక్కడ కొన్నాడనే విషయమూ చెప్పొచ్చు. టికెట్ కొన్న తేదీ.. గెల్చుకున్న తేదీ.. ఎమౌంట్ వివరాలను కూడా చెప్పొచ్చు. కానీ, అతని అడ్రస్ గిడ్రస్ లాంటి నేపథ్య వివరాలు మాత్రం వెల్లడించకూడదు. ప్రైజ్‌మనీ అనౌన్స్ చేసిన ఏడాదిలోపే ఎప్పుడైనా ఆ వ్యక్తి ముందుకొచ్చి ప్రైజ్ మనీ తీసేసుకోవచ్చు. కానీ, కాస్ట్రో మాత్రం అందుకు ఆసక్తిగా లేడట. మరి గోప్యంగా అయినా తీసుకుంటాడా? అనేది వేచిచూడాలి.
Video Credits: NBC News
ఇక జాక్‌పాట్‌కొట్టిన విషయం తెలిసిన వెంటనే షాక్‌కు, అదే సమయంలో భావోద్వేగానికి లోనైనట్లు క్యాస్ట్రో ఒక ప్రకటన విడుదల చేశాడు. పవర్‌బాల్ లాటరీ గేమ్‌లో గతంలో 1.6 బిలియన్ డాలర్లు(పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైనే..) గెల్చుకున్నారు ఎవరో. కానీ, ఆ ప్రైజ్‌మనీని మాత్రం తీసుకోవడానికి ముందుకు రాలేదంట.
అమెరియా సంయుక్త రాష్ట్రాల్లోని.. 45 రాష్ట్రాల్లో పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీ గేమ్ బాగా పాపులర్. టికెట్ ధర ఎంతో తెలుసా? కేవలం 2 డాలర్లు మాత్రమే(మన కరెన్సీలో 170 రూ. దాకా ఉంటుంది). అలా చూసుకున్నా ఎడ్విన్ క్యాస్ట్రో ఎంత లక్కీనో కదా!. పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ లాటరీ గేమ్ ఆడాలి. ఇదిలా ఉంటే భారత్‌లోనూ గుర్తింపు ఉన్న లాటరీ ఏజెన్సీల ద్వారా ఈ టికెట్ కొనుగోలు చేసుకుని ఆడొచ్చు. లక్షల్లో ఎవరో ఒకరికి చాలా చాలా అరుదుగా దక్కుతుంది ప్రైజ్ మనీ. అయితే గోల్డెన్ ఛాన్స్ కొట్టే వాళ్లు మాత్రం ఎడ్విన్ కాస్ట్రోలాగా.. కోట్లల్లో ఒక్కడు ఉంటాడేమో!.
Comments
Please login to add a commentAdd a comment