Jagtial District Tandur Man Wins RS 30 Crore In Lottery - Sakshi
Sakshi News home page

నిరుపేద డ్రైవర్‌కు లక్ష్మీ కటాక్షం!.. రాత్రికే రాత్రే రూ.30 కోట్లకు యజమాని

Published Sat, Dec 24 2022 7:48 AM | Last Updated on Sat, Dec 24 2022 11:33 AM

Jagtial District Tandur man wins RS 30 Crore in Lottery - Sakshi

సాక్షి, జగిత్యాల(సారంగాపూర్‌): ఓ నిరుపేద యువకుడిని లక్ష్మీదేవి కరుణించడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్‌ అనే యువకుడు దుబాయ్‌లో కొన్న లాటరీ టికెట్‌ అతన్ని రూ.30 కోట్లకు యజమానిని చేసింది.  గ్రామస్తుల వివరాల ప్రకారం.. తుంగూరుకు చెందిన ఓగుల ప్రమీల– దేవరాజుది పేద కుటుంబం.

వారికి గుంట వ్యవ సాయభూమి కూడా లేదు. దేవరాజు 2015లో మృతిచెందగా.. ప్రమీల తన ఇద్దరు పిల్లలు అజయ్, రాకేశ్‌ను కష్టపడి చదివించింది. అజయ్‌ నాలుగే ళ్లక్రితం ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ఓ బంగారం దుకాణంలో డ్రైవర్‌గా పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే  30 దిర్హాములతో రెండు ఎమిరేట్స్‌ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.

అందులో నంబర్లు కలిపితే ప్రైజ్‌మనీ గెలుచుకోవచ్చు. అజ య్‌ ఆరు నంబర్లు కలపడంతో 1.50 కోట్ల దిర్హాము లు (రూ.30 కోట్ల రూపాయలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అజయ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘మాది పేద కుటుంబం. నేను కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ ద్వారా రూ.30 కోట్లు గెలుచుకోవడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement