
జక్రాన్‌పల్లి: అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. నిజామాబాద్ జిల్లా వాసిని ఇలాగే అదృష్టం వరించింది. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశానికి వెళ్లొచ్చిన జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన రిక్కల విలాస్‌ను రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. విలాస్‌ది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం అనుకూలించకపోవడంతో విలాస్ నెలన్నర క్రితం ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. సరైన ఉద్యోగం లభించకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు.
భార్య పద్మ దగ్గర ఉన్న రూ. 20 వేలు తీసుకుని, అబుదాబీలో ఉంటున్న తన స్నేహితుడు రవి సహాయంతో రెండు లాటరీ (అబుదాబీలోని బిగ్ టికెట్ రాఫెల్ డ్రా) టికెట్లు కొన్నాడు. ఒకటి రవి పేరుమీద కొనుగోలు చేయగా ఇంకొకటి విలాస్ పేరుమీద తీసుకున్నారు. ఈ టికెట్టే విలాస్ తలరాత మార్చేసింది. ఈ లాటరీలో ఏకంగా 4.08 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 28.4 కోట్లు) విలాస్ సొంతమయ్యాయి. ఈ విషయమై లాటరీ కంపెనీనుంచి ఫోన్ వచ్చిందని విలాస్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment