ప్రతీకాత్మక చిత్రం
మన జీవితంలో భాగంగా మారి పోయిన స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే మనం మొత్తం కోల్పోయినట్లే ఫీలవుతాం. అంతలా మనతో పాటే కలిసిపోయింది స్మార్ట్ ఫోన్. అటువంటి ఫోన్‌ను పోగొట్టుకుంటే మనశ్శాంతి కూడా ఉండదు.. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది. వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. ముఖ్యమైన డేటా అంతా కూడా అందులోనే ఉండటంతో ప్రపంచమే ఆగిపోయినట్లు ఉంటుంది. అయితే ఇలా ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా తిరిగి దాన్ని సంపాదించుకుని ఊపిరి పీల్చుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో బాన్సువాడకు చెందిన వ్యక్తి తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఫోన్ ఎక్కడిపోయిందో అనే విషయాన్ని గుర్తుకుతెచ్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో పోయిందనే విషయాన్ని గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ ద్వారా ఆ ఫోన్ దుబాయ్‌లో ఉందని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్‌లో సెల్‌ఫోన్ పోతే అది దుబాయ్‌లో ఉందని కనుక్కోవడం వెనుక నూతన టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. అంతే ఆ సెల్‌ఫోన్‌ను దుబాయ్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఆ తర్వాత సదరు బాధితునికి డీఎస్సీ జైపాల్‌రెడ్డి.. ఆ సెల్‌ఫోన్‌ను అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment