వెదుకుతున్నది దొరికితే కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అలాంటిది పారేద్దామనుకున్న టికెట్‌కు రూ.కోట్లు దక్కితే... ఆనందానికి అవధులుండవు. ఈ యూఎస్ మహిళ విషయంలో అది నిజమైంది. రోపర్‌కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్ ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్‘5’ను ఐదు డాలర్లకు కొన్నది. ‘ప్రతి టికెట్‌కు అదృష్టం వరిస్తుందా’ అని భావించిన జాక్వలిన్ ఆ టికెట్‌ను పారేసినంత పనిచేసింది. ఎందుకైనా మంచిదని... చెత్తబుట్టలో వేసేముందు మరోసారి చెక్ చేసింది. అంతే... ఆమె లాటరీ టికెట్ రెండు లక్షల డాలర్లను గెలుచుకుంది.
‘‘నాకు ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు. పారేద్దామనుకున్న టికెట్‌కు డబ్బులు రావడం ఇంకా నమ్మశక్యంగా లేదు’’ అంటోంది జాక్వెలిన్. ట్యాక్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తయ్యాక... కోటీ 20 లక్షల రూపాయలను ఇంటికి తీసుకెళ్లింది. కార్ లోన్ కట్టడంతోపాటు ఇతర అవసరాలన్నీ తీర్చేసుకుంటానని ఆనందంగా చెబుతోంది.
చదవండి: మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి
Comments
Please login to add a commentAdd a comment