snowstorm
-
చిత్రకారుడు బాలి తనయుడు మంచు తుపానులో మృతి
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, చిత్రకారుడు, బొమ్మల శిల్పి బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్ (45) అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని మరణించాడు. అమెరికాలో గుంటూరుకు చెందిన దంపతులను రక్షించబోయి గోకుల్ ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు. ఆ సమయంలో గోకుల్ భార్య శ్రీదేవి, కూతురు మహతి ఒడ్డునే ఉన్నారు. వారి కళ్లెదుటే దుర్ఘటన జరగడంతో వారు కుప్పకూలిపోయారు. గోకుల్ కుటుంబం గత 15 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడింది. ఈయన అమెరికాలో ఓ ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గోకుల్ మరణ వార్త తెలియడంతో ఇక్కడ బాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. చదవండి: (సీపీ టు డీజీపీ.. 36 ఏళ్లలో పని చేసిన 21 మంది) -
హమ్మయ్య.. సూర్యుడు కనిపించాడు
న్యూయార్క్: అమెరికాలో గత కొద్ది రోజులుగా మంచు తుఫాన్కు అల్లాడిపోయిన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో సిటీలో ఎట్టకేలకు సూర్యరశ్మి కనిపించింది. గురువారం ఉదయం సూర్యుడి రాకతో కాసేపు వాతావరణం వెచ్చగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి నేషనల్ గార్డ్ అధికారులు ఇంటింటికి వెళ్తున్నారు. విద్యుత్ సౌకర్యం పోయిన ఇళ్లకి వెళ్లి వారు ఎలా ఉన్నారో వాకబు చేస్తున్నారు. తీవ్రమైన మంచు కురుస్తున్నప్పుడు కరెంట్ పోయిన సమయంలో ఆక్సిజన్ వెంటిలేషన్ మీద ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సహాయం అందక కొందరు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రహదారులపై కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచు కరిగితే ఇంకా ఎన్ని మృతదేహాలు బయటకు వస్తాయోనన్న ఆందోళనైతే నెలకొంది. బఫెలో నగరంలో రాకపోకల్ని పునరుద్ధరించారు. భారీ యంత్రాల సాయంతో రహదారులపై ముంచెత్తిన మంచుని తొలగించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని బఫెలో నగర మేయర్ బైరన్ బ్రౌన్ వెల్లించారు. అత్యవసరమైతే తప్ప ఇంకా ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆయన నగర ప్రజలను హెచ్చరించారు. అమెరికాలోని మరికొన్ని రాష్ట్రాల్లో మంచు ముంచేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో నీటి పైపులు పగిలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కుదిపేసిన మంచు తుఫాన్ కాస్త శాంతించినట్టే కనిపిస్తోంది. -
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’
చికాగో : అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా కొలరాడో, నెబ్రస్కా, డకోటాల్లోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. మరికొన్నిచోట్ల హిమపాతంతోపాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకట్లో మగ్గిపోయాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుపానును ‘బాంబ్ సైక్లోన్’గా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్ ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్నారు. న్యూమెక్సికోలో వీచిన బలమైన గాలులకు ఒక రైలుకు చెందిన 26 బోగీలు వంతెనపై నుంచి పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. -
వణికిస్తున్న మంచుతుఫాను