వేసవి సీజన్‌లో విభిన్న ప్రాంతాలను చుట్టి రావాలని ఆశించే సిటీజనుల కోసం నగరానికి చెందిన టూర్‌ఆపరేటర్లు రకరకాల ఆకర్షణీయమైన ప్యాకేజీలతో సందడి సృష్టిస్తున్నారు. ఇటీవల నగరం నుంచి టూర్స్‌కి వెళ్లేవారి సంఖ్య పెరగడంతో పాటు అందుబాటు బడ్జెట్‌లో ఉండే వాటికి ఆదరణ కూడా పెరుగుతుండడంతో ఈ తరహా ప్యాకేజీల విషయంలో ఆపరేటర్ల మధ్యపోటీ నెలకొంది. ఇది దేశ విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను మధ్యతరగతి వారికి కూడా చేరువ చేస్తోంది. అలాంటి వాటిలో ఇండోనేసియా రాజధానిబాలి ఒకటి.
సాక్షి, సిటీబ్యూరో :ఇండోనేసియాలోని అందమైన ఐలాండ్ సిటీ బాలి. అగ్ని పర్వతాలకు చేరువలోనే అందమైన బీచ్‌లు, పగడపు దిబ్బలు, ఉలువట్టు టెంపుల్, బీచ్ సైడ్ సిటీ కుటా, సెమిన్యాక్, సనూర్, నూసా డువా వంటి రిసార్ట్ టౌన్స్, యోగా మెడిటేషన్ రిట్రీట్స్‌కి కూడా ఈ ఐలాండ్ పేరొందింది. పూర్తిగా ప్రకృతి సౌందర్యానికి నిలయం ఈ ఐలాండ్ సిటీ. నగరం నుంచి బాలికి పర్యాటకుల సంఖ్య ఎక్కువే. దీనిని దృష్టిలో ఉంచుకుని టూర్ ఆపరేటర్లు కనీసం రూ.40 వేల నుంచి మొదలుకుని ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ప్రముఖ టూర్ ఆపరేటర్ కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ ఒక వ్యక్తికి రూ.43,882 చొప్పున ప్యాకేజీని ప్రకటించింది. రాకపోకల విమాన ఖర్చుల నుంచి 7రోజులు, 6 పగళ్లు వసతి వరకూ ఇందులోనే కలిపి ఉన్నాయి.
ఖర్చుల్ని తగ్గించుకునే చిట్కాలు..
♦ నగరంలో అంతర్గత రాకపోకలకు షటిల్ సర్వీస్ బస్సులను వినియోగించాలి. ఇవి చాలా సులభంగా అందుబాటులో ఉండడంతో పాటు తక్కువ ఖర్చు, సురక్షితం, సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. నగరంపై అవగాహనకూ ఉపకరిస్తాయి.
♦ ఇక్కడ వీధుల్లో లభించే ఆహారం కూడా అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో ముగించాలని అనుకునేవారు వీటిని ఎంచుకోవడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment