Summer trip
-
బాలి..భలే
వేసవి సీజన్లో విభిన్న ప్రాంతాలను చుట్టి రావాలని ఆశించే సిటీజనుల కోసం నగరానికి చెందిన టూర్ఆపరేటర్లు రకరకాల ఆకర్షణీయమైన ప్యాకేజీలతో సందడి సృష్టిస్తున్నారు. ఇటీవల నగరం నుంచి టూర్స్‌కి వెళ్లేవారి సంఖ్య పెరగడంతో పాటు అందుబాటు బడ్జెట్లో ఉండే వాటికి ఆదరణ కూడా పెరుగుతుండడంతో ఈ తరహా ప్యాకేజీల విషయంలో ఆపరేటర్ల మధ్యపోటీ నెలకొంది. ఇది దేశ విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను మధ్యతరగతి వారికి కూడా చేరువ చేస్తోంది. అలాంటి వాటిలో ఇండోనేసియా రాజధానిబాలి ఒకటి. సాక్షి, సిటీబ్యూరో :ఇండోనేసియాలోని అందమైన ఐలాండ్ సిటీ బాలి. అగ్ని పర్వతాలకు చేరువలోనే అందమైన బీచ్‌లు, పగడపు దిబ్బలు, ఉలువట్టు టెంపుల్, బీచ్ సైడ్ సిటీ కుటా, సెమిన్యాక్, సనూర్, నూసా డువా వంటి రిసార్ట్ టౌన్స్, యోగా మెడిటేషన్ రిట్రీట్స్‌కి కూడా ఈ ఐలాండ్ పేరొందింది. పూర్తిగా ప్రకృతి సౌందర్యానికి నిలయం ఈ ఐలాండ్ సిటీ. నగరం నుంచి బాలికి పర్యాటకుల సంఖ్య ఎక్కువే. దీనిని దృష్టిలో ఉంచుకుని టూర్ ఆపరేటర్లు కనీసం రూ.40 వేల నుంచి మొదలుకుని ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ప్రముఖ టూర్ ఆపరేటర్ కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ ఒక వ్యక్తికి రూ.43,882 చొప్పున ప్యాకేజీని ప్రకటించింది. రాకపోకల విమాన ఖర్చుల నుంచి 7రోజులు, 6 పగళ్లు వసతి వరకూ ఇందులోనే కలిపి ఉన్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునే చిట్కాలు.. ♦ నగరంలో అంతర్గత రాకపోకలకు షటిల్ సర్వీస్ బస్సులను వినియోగించాలి. ఇవి చాలా సులభంగా అందుబాటులో ఉండడంతో పాటు తక్కువ ఖర్చు, సురక్షితం, సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. నగరంపై అవగాహనకూ ఉపకరిస్తాయి. ♦ ఇక్కడ వీధుల్లో లభించే ఆహారం కూడా అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో ముగించాలని అనుకునేవారు వీటిని ఎంచుకోవడం ఉత్తమం. -
ఆఫీసర్ ఆన్ చిల్లింగ్ మోడ్
సిన్సియర్ ఆఫీసర్‌గా టేకప్ చేసిన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మిషన్ కంప్లీట్ అయింది కదా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారు. వెంటనే హాలీడేకు పయనం అయ్యారు ఆఫీసర్ నాగార్జున. తన లేటెస్ట్ సినిమా ‘ఆఫీసర్’ పూర్తి అయిపోయి రిలీజ్‌కు రెడీగా ఉండటం, పైగా సమ్మర్ కావడంతో వెంటనే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేశారు నాగార్జున. సరదాగా చిల్ అవ్వడం కోసం యూరప్‌లోని డుబ్రోవ్నిక్ సిటీని ఎంచుకున్నారాయన. డుబ్రోవ్నిక్‌లో చిల్ అవుతున్న ఫొటోను ‘డుబ్రోవ్నిక్స్లో చిల్ అవుతున్నాను. 3000 ఏళ్ల వయసున్న సిటీ’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగార్జున. డుబ్రోవ్నిక్ విషయానికి వస్తే... యూరప్‌లో వన్నాఫ్ ది మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీస్‌లో ఇదొకటి. 3000 సంవత్సరాల వయసున్న ఈ సిటీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్‌లో ఉండటం విశేషం. ఈ ట్రిప్ నుంచి రిటర్న్ అయిన వెంటనే శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో నానీతో కలసి యాక్ట్ చేస్తున్న మల్టీస్టారర్ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతారట నాగార్జున. -
హాలిడే హంగామా
ముందు సముద్రం... చుట్టూ పచ్చదనం... తోడుగా చైతన్యం... ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు సమంత. కాబోయే శ్రీవారు నాగచైతన్యతో కలసి సమంత సమ్మర్ ట్రిప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. వీళ్లిప్పుడు థాయ్‌ల్యాండ్‌లోని కోహ్ సముయ్‌లో ఉన్నారు. నార్మల్‌గా షూటింగులు, స్టోరీ సిట్టింగుల కోసమని హైదరాబాద్ సిటీలోనో, మరెక్కడో ఉంటే... డైటింగ్, జిమ్‌లో వర్కౌట్స్ ట్రైనింగ్ అంటూ ఏవేవో ఫాలో అవుతుంటారు. అంత దూరం వెళ్లి, అక్కడ కూడా వర్కౌట్స్ చేయడం, డైట్ ఫాలో కావడం ఎందుకని అనుకున్నట్టున్నారు. ఈ సమ్మర్ హాలిడేలో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారట. నో డైట్... నో వర్కౌట్స్... శుభ్రంగా మనసుకు నచ్చిన ఫుడ్ తింటూ తిరిగేస్తున్నారట! ‘హాలిడేస్‌లో నేను ఇలాగే వర్కౌట్ చేస్తా’ అని బాక్సింగ్ కోర్టులో నిద్రపోతున్న ఫొటోను, మరికొన్ని హాలిడే ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. -
సెల్ఫ్ చెక్
సమ్మర్ ట్రిప్ సరిగా ప్లాన్ చేస్తున్నారా? పిల్లలకు పరీక్షలయ్యాయి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న ప్రదేశాలను చూడడానికి ఇదే మంచి సమయం. ఇబ్బందులను ఎదుర్కోకుండా ట్రిప్‌ను ఆద్యంతం ఆస్వాదించాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి?- అన్న విషయంలో మీకు ఉన్న అవగాహనను ఒకసారి చెక్ చేసుకోండి. 1. మీతోపాటు మీ పిల్లలు, అమ్మానాన్నలు... ఇలా ఇంటిల్లిపాదీ కలిసే వెళ్లే ప్రదేశాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అవును కాదు 2. ఇంట్లో అందరికీ నచ్చే ప్రదేశం దాదాపుగా ఏ ఒక్కటీ ఉండదు. కాబట్టి ఆ ట్రిప్‌లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి సాంక్చురీ, మీకు నచ్చే మాన్యుమెంట్స్తోపాటు మీ అమ్మానాన్నలకు నచ్చే ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం... ఉండేలా ప్లాన్ చేస్తారు. అవును కాదు 3. చారిత్రక కట్టడాల వంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యటించడానికి ఉదయం లేదా సాయంత్రం మంచిదని(ఎండ తక్కువగా ఉండే సమయం) మీకు తెలుసు. అవును కాదు 4. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పర్యటించే ముందే అక్కడి దర్శనానికి అనుమతించే సమయం, పూజలు, సేవల వివరాలను తెలుసుకుని ఆ మేరకు ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. అవును కాదు 5. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వంటి ప్రదేశాల్లో పర్యటించే ముందుగా అక్కడ ఏ జంతువులు ఉంటాయి, వాటి ప్రాముఖ్యత వంటి వివరాలు తెలుసుకుని పిల్లలకు ఆసక్తి కలిగేటట్లు వాటిని చెబుతారు. అవును కాదు 6. హిల్స్టేషన్లకు వెళ్లేటప్పుడు అక్కడ నడవటానికి అనువుగా ఉండే పాదరక్షలను తప్పకుండా జాగ్రత్త తీసుకుంటారు. అవును కాదు 7. విలువైన ఆభరణాలు, యాక్సెసరీస్ వంటివి ధరించడం వల్ల వెళ్లిన చోట ఆ ప్రదేశాన్ని ఎంజాయ్ చేయడం కంటే మన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది - కాబట్టి ధర తక్కువైన సింపుల్ యాక్సెసరీస్ మాత్రమే ధరిస్తారు. అవును కాదు పైవాటిలో ‘అవును’లు ఎక్కువ వస్తే మీకు సమ్మర్ ట్రిప్పై సరైన ప్లానింగ్ వుందని చెప్పవచ్చు.