ఆఫీసర్‌ ఆన్‌ చిల్లింగ్‌ మోడ్‌ | Nagarjuna chills out in a 3000 year old European City | Sakshi
Sakshi News home page

ఆఫీసర్‌ ఆన్‌ చిల్లింగ్‌ మోడ్‌

Published Sun, May 20 2018 1:37 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna chills out in a 3000 year old European City - Sakshi

సిన్సియర్‌ ఆఫీసర్‌గా టేకప్‌ చేసిన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మిషన్‌ కంప్లీట్‌ అయింది కదా కొంచెం రిలాక్స్‌ అవుదాం అనుకున్నారు. వెంటనే హాలీడేకు పయనం అయ్యారు ఆఫీసర్‌ నాగార్జున. తన లేటెస్ట్‌ సినిమా ‘ఆఫీసర్‌’ పూర్తి అయిపోయి రిలీజ్‌కు రెడీగా ఉండటం, పైగా సమ్మర్‌ కావడంతో వెంటనే ఒక చిన్న ట్రిప్‌ ప్లాన్‌ చేశారు నాగార్జున. సరదాగా చిల్‌ అవ్వడం కోసం యూరప్‌లోని డుబ్రోవ్నిక్‌ సిటీని ఎంచుకున్నారాయన. డుబ్రోవ్నిక్‌లో చిల్‌ అవుతున్న ఫొటోను ‘డుబ్రోవ్నిక్స్‌లో చిల్‌ అవుతున్నాను.

3000 ఏళ్ల వయసున్న సిటీ’ అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు నాగార్జున. డుబ్రోవ్నిక్‌ విషయానికి వస్తే... యూరప్‌లో వన్నాఫ్‌ ది మోస్ట్‌ టూరిస్ట్‌ అట్రాక్షన్‌ ఉన్న సిటీస్‌లో ఇదొకటి.  3000 సంవత్సరాల వయసున్న ఈ సిటీ యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ లిస్ట్‌లో ఉండటం విశేషం. ఈ ట్రిప్‌ నుంచి రిటర్న్‌ అయిన వెంటనే శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో నానీతో కలసి యాక్ట్‌ చేస్తున్న మల్టీస్టారర్‌ మూవీ షూటింగ్‌లో జాయిన్‌ అవుతారట నాగార్జున.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement