
అమలా పాల్
అమలా పాల్ కాస్తా అమలా పూల్ అయిందేంటని ఆలోచిస్తున్నారా? కింద ఉన్న ఫొటో చూశారు కదా. పువ్వులు నిండిన తొట్టిలో అమలా పాల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో? అందుకే అమలా పూల్ అన్నాం. షూటింగ్స్‌కి కాస్త విరామం ఇచ్చి తన బర్త్‌డేను (అక్టోబర్ 26) సెలబ్రేట్ చేసుకోవడానికి బాలీకి హాలిడేకు వెళ్లారు అమలా. అక్కడ కొన్ని రోజులు తనకు నచ్చినట్లుగా గడిపారామె. ఆ వెకేషన్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. వాటిలో పూలతో నిండిన బాత్ టబ్‌లో ‘హీలింగ్ బాత్’ చేస్తున్న ఫొటో ఒకటి. ఇక సినిమాల విషయానికి వస్తే.. అమలా పాల్ నటించిన ‘అదో అంద పరవై పోల’ అనే తమిళ లేడీ ఓరియంటెడ్ చిత్రం, ‘ఆడు జీవితం’ అనే మలయాళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘లస్ట్ స్టోరీస్’ యాంథాలజీలోనూ నటిస్తున్నారు అమలా పాల్.