![Amala Paul to star in Telugu remake of Lust Stories - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/24/Amala-Pual-DOhjU0DVQAAlk6L.jpg.webp?itok=Ai4HaX4V)
వెబ్ సిరీస్‌లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా సిరీస్‌లలో నటించేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు పచ్చజెండా ఊపుతున్నారు. ఆల్రెడీ అమలా పాల్ ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం చేసిన హిందీ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. తాజాగా ‘కుడి ఎడమైతే’ పేరుతో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించారట. పవన్ కుమార్ దర్శకత్వంలో తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’ ఈ సిరీస్‌ని నిర్మించనుందని టాక్. థ్రిల్లర్ కథాంశంతో ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ సాగుతుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment