
హిందీ భాషపై పట్టు సాధించే ప్రయత్నాలను మొదలుపెట్టారు హీరోయిన్ అమలాపాల్. ఎందుకంటే తొలిసారి ఆమె హిందీ డైలాగ్స్ చెప్పబోతున్నారు. కానీ సినిమాలో కాదు.. వెబ్ సిరీస్ కోసం. ‘చిచోరే’ ఫేమ్ తాహిర్ రాజ్ బాసిన్, అమృత ఇందులో కీలక పాత్రధారులు. పుష్పదీప్ భరద్వాజ్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తారు. బాలీవుడ్ ప్రముఖ దర్శక–నిర్మాత, రచయిత మహేశ్‌భట్ ప్రొడక్షన్‌లో ఈ వెబ్ సిరీస్ రూపుదిద్దుకోనుంది.
1970లో పెద్ద ఫిల్మ్‌మేకర్ కావాలనుకున్న ఓ యువకుడు, ఓ అగ్ర హీరోయిన్ మధ్య కొనసాగిన రిలేషన్‌షిప్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం. దివంగత నటి పర్వీన్ బాబీ జీవితం నేపథ్యంలో అమలా పాల్ పాత్రను డిజైన్ చేశారట. ‘‘1970 బ్యాక్‌డ్రాప్‌లోని ఓ బాలీవుడ్ లవ్‌స్టోరీ నేపథ్యం ఉన్న కథాంశంలో నటించబోతున్నాను. నా బాలీవుడ్ అండ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఇంతకన్నా నాకు ఏం కావాలి’’ అన్నారు అమలాపాల్.
Comments
Please login to add a commentAdd a comment