హనాను ఆపేందుకు ప్రయత్నిస్తున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది
మనం ఎక్కాల్సిన బస్సో, రైలో మిస్సయితే ఏం చేస్తాం. మహా అయితే పరుగెత్తుకు వెళ్లి వాటిని ఆపే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా సాధారణ విషయం. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా విమానాన్నే ఆపాలని ప్రయత్నించారు. అధికారుల మాటలు పట్టించుకోకుండా నిబంధనలు అతిక్రమించి ఇబ్బందుల పాలయ్యారు.
అసలేం జరిగిందంటే... ఇండోనేషియాకు చెందిన హనా అనే మహిళ బాలి నుంచి జకార్తాకు విమానంలో వెళ్లేందుకు టికెట్ బుక్‌చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాలిలోని గురారాయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో విమానం రన్‌వే పైకి చేరుకుంది. దీంతో ఎలాగైనా విమానం ఎక్కాలని భావించిన ఆమె భద్రతా సిబ్బందిని తప్పించుకుని మరీ అక్కడికి పరిగెత్తారు. ఇది గమనించిన సిబ్బంది హనాను ఆపేందుకు ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించారు. ఈ క్రమంలో హనా కిందపడిపోయారు.
కాగా ఈ తతంగాన్నంతా అక్కడ ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘విమానాన్ని ఆపేందుకు ఇలాంటి బిత్తిరి చర్యలకు పాల్పడాలా... కాస్త ఆగి మరో విమానం ఎక్కొచ్చుగా’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment