Samantha Bali Diaries: Know Price Of Her Expensive Outfit, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha Bali Vacation Video: బాలి వెకేషన్‌లో సమంత.. డ్రెస్‌ కాస్ట్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Published Wed, Jul 26 2023 1:15 PM | Last Updated on Wed, Jul 26 2023 2:04 PM

Samantha Bali Diaries: Know Price Of Her Expensive Outfit, Pic Goes Viral - Sakshi

సెలబ్రిటీలను చాలామంది ఫాలో అవుతుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాళ్లు వేసుకున్న డ్రెస్సులు, వాచీలు, గాడ్జెట్స్‌పై జనాలు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. వాళ్లు ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా ఆ వార్తలు క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ సమంత వేసుకున్న డ్రెస్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆ స్టోరీ ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం.

సమంత ఫ్యాషన్‌ సెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పన​‍క్కర్లేదు. గతంలోనూ సామ్‌ అవుట్‌ఫిట్స్‌ సూపర్‌ ట్రెండ్‌ అయ్యాయి. ప్రస్తుతం సామ్‌ సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మయోసైటిస్‌ నుంచి బయటపడిన సమంత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించదని టాక్‌.

పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం  యూఎస్‌ వెళ్లనుంది.  బ్రేక్‌  ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్‌కు వెళ్లిన సమంత తాజాగా బాలికి వెకేషన్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటుంది. రీసెంట్‌గా సమంత వేసుకున్న ఓ డ్రెస్‌ డీటెయిల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇందులో ఓ డ్రెస్‌లో సమంత క్యూట్‌ లుక్స్‌తో మెస్మరైజ్‌ చేసింది. ఇక ఆ డ్రెస్‌ కాస్ట్‌ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కల్ట్ గయా కామెరూన్ నిట్‌ ‍బ్రాండ్‌కు చెందిన గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో సమంత స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. ఆ డ్రెస్‌ ఖరీదు సుమారు రూ.  37, 790 రుపాయలు అని తేలింది. దీంతో ఇంత సింపుల్‌ డ్రెస్‌ అంత ఖరీదా అని నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement