బాలీవుడ్ నటి మలైకా అరోరా తన అద్భుతమైన ఫిజిక్, స్టైల్‌తో ఫ్యాన్స్‌ను ఎపుడూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ ఉర్రూత లూగించడం, లక్షలాది మంది అభిమానులను మంత్రముగ్ధులను చెయ్యడం అలవాటు.పబ్లిక్ అప్పీరెన్స్‌లో ఫ్యాషన్ ఐకాన్‌గా నిలవడం ఆమెకు అలవాటు.తన వార్డ్‌రోబ్‌లో లగ్జరీ యాక్ససరీస్‌కు పాపులర్ అయిన ఈ చయ్యా చయ్యా అమ్మడు ఇటీవల వెకేషన్‌ను ఎంజాయ్ చేసి వచ్చిందట
అజర్‌బైజాన్‌లోని బాకులో ఆనందంగా గడిపిన క్షణాలుంటూ కొన్నిఫోటోలు, వీడియోతో అందరినీ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అజర్‌బైజాన్ వెకేషన్‌లో ధరించిన వైట్-హ్యూడ్ ట్యాంక్ డ్రెస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తెల్లని పొడవాటి వైట్ గౌను, మెడలో రెండు గొలుసులు, సన్ గ్లాసెస్‌తో స్పెషల్ లుక్‌లో ఉంది.
సోర్చ్ అన్‌నోన్ అనే బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్ ధర భారతీయ కరెన్సీలో టాక్స్‌లు మినహాయించి రూ. 5,909లట. కాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌ను మలైకా వివాహం ,అర్హాన్ అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం బీటౌన్ హీరో అర్జున్ కపూర్‌ల ప్రేమయాణం గురించి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment