కోతి చేసిన పనికి ఆ కుటుంబం.. | Monkey Takes Selfie With Camera In Bali | Sakshi
Sakshi News home page

ఆ కోతి కెమెరా లాక్కొని సెల్ఫీ దిగింది

Published Thu, Jun 13 2019 3:28 PM | Last Updated on Thu, Jun 13 2019 3:36 PM

Monkey Takes Selfie With Camera In Bali - Sakshi

బాలి : ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్లు కానీ అల్లరి చేస్తుంటే..‘ఏంట్రా ఆ కోతి పనులు’అని చివాట్లు పెడతాము. అలాంటిది ఓ కోతి.. మనిషి పనులు చేస్తే? ఆశ్చర్యపడక తప్పదు. ఇలాంటి పరిస్ధితే ఓ కుటుంబానికి ఎదురయ్యింది. కోతి చేసిన పనికి ఆశ్చర్యపోవటమే కాకుండా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవటం వారిపనైంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ కుటుంబం వెకేషన్‌కోసం ఇండోనేషియాలోని బాలి దీవులకు వచ్చింది. వారు అక్కడి ప్రదేశాలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నారు. అలాగే ఓ రోజు అక్కడి కోతుల అడవికి ప్రయాణమై వెళ్లారు. అక్కడి ప్రదేశాలను చుట్టి, అందుకు గుర్తుగా ఫొటోలు తీసుకుంటున్నారు. అలా ఓ చోట కుటుంబం మొత్తం ఫొటోకు ఫోజులిచ్చింది.

గైడ్‌ వారి ఫొటో తీస్తుండగా.. అక్కడికి వచ్చిన ఓ కోతి అతడి చేతిలోని కెమెరా లాక్కొని సెల్ఫీలు దిగింది. తర్వాత గైడ్‌ తన జేబులోని పల్లీలను దానికి ఇవ్వగా వాటిని తింటూ పక్కకు వెళ్లిపోయింది. అయితే కోతి సెల్ఫీ దిగటం చూసిన ఆ కుటుంబం ఎంతో ఆశ్చర్యానికి గురైంది. కోతి దిగిన సెల్ఫీ ఫొటోలను చూసి ఆ కుటుంబం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement