న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వడం వైరల్‌గా మారింది. సిడ్నీకి చెందిన మార్కెటింగ్ సంస్థ సూప్ ఏజెన్సీ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. మొత్తం ఉద్యోగులందరినీ చాలా ఖరీదైన ట్రిప్‌కు తీసుకెళ్లింది. అందులోనూ ఉద్యోగులలో ఒకరి 24వ పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహించింది. దీంతో కంపెనీ ఎండీ కాట్యా వకులెంకో, "వరల్డ్స్ బెస్ట్ బాస్" అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ రోజు సూప్ ఏజెన్సీ మూడో పుట్టినరోజును జరుపుకుంటోంది. తొందర్లోనే మరో యూరప్‌కు ట్రిప్‌ను ప్లాన్ చేస్తోందట కంపెనీ.
ఈ సంవత్సరం మేలో జరిగిన ఈ ట్రిప్‌పై నెటిజన్లులు కామెంట్ల వర్షం కురిపించారు. "లక్కీ ఉద్యోగులు...మనకు అదంతా కలే " అని ఒక యూజర్ వాపోయాడు. నాకు అలాంటి అద్భుతమైన ఏజెన్సీ, యజమానిని దొరికితేనా.. నా నా సామి రంగ అన్నట్టుగా మరొకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఏమైనా వేకెన్సీలున్నాయా బాస్ అంటూ మరో యూజర్ కమెంట్ చేయడం విశేషంగా నిలిచింది.
ఇండొనేసియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బాలికి తన ఉద్యోగులందర్నీ హాలీడే ట్రిప్‌నకు పంపించింది ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సూప్ ఏజెన్సీ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 2 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చింది. అంతేకాదు విలాసవంతమైన హాలీడే ట్రిప్‌నకు అయ్యే ఖర్చులన్నీ తానే భరించింది. దీంతో ఉద్యోగులందరూ ఎగిరి గంతేసి మరీ పండగ చేసుకున్నారు. ఫ్యామిలీలతో బాలికి చెక్కేశారు. జాగింగ్‌లు, డ్రింక్స్‌తో అంటూ తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జూన్ 9న కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బాలిలో ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, సూప్ ఏజెన్సీ సిడ్నీలో ఇండిపెండెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇన్వెంటివ్, డేటా ఆధారిత ప్రచారాలకు అత్యుత్తమ ఫలితాలను సాధించిన కంపెనీగా పాపులర్ అయింది. కోవిడ్-19 సంక్షోభం సమయంలో ఉత్పాదకత ఎక్కువగానే ఉందని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కుమి హో తెలిపారు. ఇది ఖచ్చితంగా జీవితంలో మరచిపోలేని అనుభవం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment