australian plane
-
ఎయిర్ ఏషియా విమాన ఆచూకీ లభ్యం !
-
గల్లంతైన ఎయిర్ ఏషియా విమాన ఆచూకీ లభ్యం !
ఇండోనేసియా: ఇండోనేసియా సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ కనుగొన్నట్లు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. ఆ విమానానికి సంబంధించిన శకలాలు జావా సముద్రంలో గుర్తించినట్లు తెలిపింది. విమానంలోని మొత్తం 162 మంది మరణించారని పేర్కొంది. 155 మంది ప్రయాణికులతొపాటు ఏడుగురు విమాన సిబ్బందితో ఎయిర్ ఏషియా విమానం - క్యూజెడ్ 8501 ఆదివారం ఉదయం ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ బయలుదేరింది. ఆ కొద్ది సేపటికే ఇండోనేసియా విమానాశ్రయంలోని ఏసీటీ కేంద్రం నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమాన ఆచూకీ కోసం ఇండోనేసియా ప్రభుత్వం గాలింపు చర్యలు తీవ్రతరం చేసింది. అందులోభాగంగా ఎయిర్ ఏషియా విమాన శకలాలు జావా సముద్రంలో ఉన్నట్లు గాలింపు చర్యలు చేపట్టిన బృందాలు గుర్తించాయని మీడియా తెలిపింది. అయితే విమానం కనుగొన్న విషయాన్ని ప్రభుత్వం ధృవీకరించవలసి ఉంది. -
ఆకాశంలో తాగుబోతు వీరంగం, హైజాక్ అనుమానాలు
* తాగి కాక్ పిట్ లోకి చొరబడ్డ ప్రయాణికుడు * ప్రయాణికుడి హడావిడితో హైజాక్ భయం * అత్యవసరంగా డెన్ పసార్ లో దిగిన విమానం * బాటిల్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్ట్రేలియాకి చెందిన ఒక విమానం హైజాక్ అనుమానాలతో అత్యవసరంగా ఇండోనీషియాలోని బాలి ద్వీపంలోని డెన్ పసార్ ఎయిర్ పోర్టులో దిగింది. బ్రిస్బేన్ నుంచి బాలి వెళ్లాల్సిన ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఓ తాగుబోతు సృష్టించిన హై డ్రామా అని త్వరలో తేలిపోయింది. మద్యం మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు విమానం కాక్ పిట్ లోకి బలవంతంగా చొరబడేందుకు యత్నించాడు. దీనితో సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. డెన్ పసార్ విమానాశ్రయంలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక సోమాలియా విమానం హైజాక్ కి గురైంది. ఆస్ట్రేలియన్ విమానం హైజాక్ అయినట్టు మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాగిన మైకంలో ఉన్న ఒక ప్రయాణికుడు చేసిన హడావిడే ఈ అనుమానాలకు కారణమని తరువాత వెల్లడైంది.