హైజాక్‌కు గురైన మెరైన్ ఎక్స్‌ప్రెస్ షిప్
సాక్షి, ముంబై : రూ. 52 కోట్లు విలువైన గ్యాసోలిన్‌ను రవాణా చేస్తున్న భారతీయ నౌక రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయింది. ఈ నౌకలో 22 మంది సైలర్లు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్ ఎక్స్‌ప్రెస్ నుంచి 48 గంటలుగా ఎలాంటి సమాచారం లేదు.
దీంతో ఓడ హైజాక్‌కు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. గత నెలలో ఇదే ప్రాంతంలో ఓ భారతీయ నౌక హైజాక్‌కు గురైంది. గ్యాసోలిన్‌ను చోరి చేసేందుకే షిప్‌ను హైజాక్ చేసివుంటారని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఆచూకీ లేకుండా పోయిన నౌక కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత్ గాలింపు చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment