marine express ship
-
హైజాకైన భారతీయులకు విముక్తి
న్యూఢిల్లీ : హైజాక్‌కు గురైన వాణిజ్య నౌకలోని 22 మంది భారతీయులకు విముక్తి కలిగిందని విదేశాంగ మంత్రి సుస్మా స్వరాజ్ మంగళవారం తెలిపారు. ఆంగ్లో ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఓడ ఆయిల్ రవాణా చేస్తుండగా పశ్చిమాఫ్రికా దేశం బెనిన్ సముద్ర తీరం వద్ద హైజాక్‌కు గురైంది. సముద్రపు దొంగలు ఓడలోని నౌకా సిబ్బందిని తమ బందీలుగా చేసుకున్నారు. శుక్రవారం నుంచి ఓడ జాడ తెలియకుండాపోయింది. ఈ విషయం భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలియడంతో ఆమె నైజీరియా, బెనిన్ దేశాల అధికారులకు చెప్పారు. ఈ విషయంలో సహాయం చేయాలని అర్దించారు. అప్రమత్తమైన అక్కడి అధికారులు నౌకా సిబ్బందిని విడిపించడంతో ప్రత్యేక పాత్ర పోషించారు. ఓడలో ఉన్న 13,500 టన్నుల ఆయిల్ కూడా సురక్షితంగా ఉంది. అక్కడి అధికారులు సముద్రపు దొంగలకు డబ్బులేమైనా చెల్లించారా అనేది తెలియాల్సి ఉంది. భారతీయులు విడుదల కావడం పట్ల ఆనందంగా ఉందని ట్విటర్ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి సుస్మాస్వరాజ్ తెలిపారు. -
హమ్మయ్యా.. ఆ 22మంది భారతీయులు సేఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సముద్రపు దొంగల చెర నుంచి 22 మంది భారతీయులు విడుదలయ్యారు. దీంతో ఆ భారత సెయిలర్ల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఓడలో ఐదు రోజుల చెర అనంతరం దొంగలు వీరిని విడిచి పెట్టినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ మలిని శంకర్ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం ఓడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు సమాచారం. రూ. 52 కోట్లు విలువైన గ్యాసోలిన్‌ను రవాణా చేస్తున్న భారతీయ ఓడ గత ఐదు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన విషయం తెలిసిందే. వాయవ్య ఆఫ్రికా తీరంలోని బెనిన్ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్ ఎక్స్‌ప్రెస్ బెనిన్లోని గినియా తీరంలో హైజాక్ అయింది. ఈ ఓడలో 22 మంది భారత సిబ్బంది ఉన్నారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో గ్యాసోలిన్‌ను చోరి చేసేందుకే షిప్‌ను హైజాక్ చేసివుంటారని అధికారులు భావించారు. ఆచూకీ లేకుండా పోయిన ఓడ కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత్ గాలింపు చర్యలు చేపట్టగా చివరికి సముద్రపు దొంగలు ఓడ సిబ్బందిని విడిచిపెట్టారు. కాగా, గత నెలలో ఇదే ప్రాంతంలో ఓ భారతీయ నౌక హైజాక్‌కు గురైంది. ఏమైనా భారీ మొత్తంలో నగదు చెల్లించిన తర్వాత బంధీలను దొంగల ముఠా విడిచిపెట్టి ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది. -
భారతీయ ఓడ హైజాక్..!
సాక్షి, ముంబై : రూ. 52 కోట్లు విలువైన గ్యాసోలిన్‌ను రవాణా చేస్తున్న భారతీయ నౌక రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయింది. ఈ నౌకలో 22 మంది సైలర్లు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్ ఎక్స్‌ప్రెస్ నుంచి 48 గంటలుగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఓడ హైజాక్‌కు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. గత నెలలో ఇదే ప్రాంతంలో ఓ భారతీయ నౌక హైజాక్‌కు గురైంది. గ్యాసోలిన్‌ను చోరి చేసేందుకే షిప్‌ను హైజాక్ చేసివుంటారని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఆచూకీ లేకుండా పోయిన నౌక కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత్ గాలింపు చర్యలు చేపట్టింది.