హైజాక్‌కు గురైన ఓడ( పాత చిత్రం)
న్యూఢిల్లీ : హైజాక్‌కు గురైన వాణిజ్య నౌకలోని 22 మంది భారతీయులకు విముక్తి కలిగిందని విదేశాంగ మంత్రి సుస్మా స్వరాజ్ మంగళవారం తెలిపారు. ఆంగ్లో ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఓడ ఆయిల్ రవాణా చేస్తుండగా పశ్చిమాఫ్రికా దేశం బెనిన్ సముద్ర తీరం వద్ద హైజాక్‌కు గురైంది. సముద్రపు దొంగలు ఓడలోని నౌకా సిబ్బందిని తమ బందీలుగా చేసుకున్నారు. శుక్రవారం నుంచి ఓడ జాడ తెలియకుండాపోయింది. ఈ విషయం భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలియడంతో ఆమె నైజీరియా, బెనిన్ దేశాల అధికారులకు చెప్పారు.
ఈ విషయంలో సహాయం చేయాలని అర్దించారు. అప్రమత్తమైన అక్కడి అధికారులు నౌకా సిబ్బందిని విడిపించడంతో ప్రత్యేక పాత్ర పోషించారు. ఓడలో ఉన్న 13,500 టన్నుల ఆయిల్ కూడా సురక్షితంగా ఉంది. అక్కడి అధికారులు సముద్రపు దొంగలకు డబ్బులేమైనా చెల్లించారా అనేది తెలియాల్సి ఉంది. భారతీయులు విడుదల కావడం పట్ల ఆనందంగా ఉందని ట్విటర్ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి సుస్మాస్వరాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment