ఆగస్ట్‌లో సెవిలి | sevili movie in August | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌లో సెవిలి

Published Sat, Jul 18 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

ఆగస్ట్‌లో సెవిలి

ఆగస్ట్‌లో సెవిలి

 సెవిలి చిత్రం ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు ఆ చిత్ర దర్శకుడు ఆర్‌ఏ.ఆనంద్ తెలిపారు. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, దెయ్యాలు, పిశాచులు,యాక్షన్,కామెడీ తరహా చిత్రాలు వస్తున్న ఈ రోజుల్లో ఇక చక్కని ప్రేమానుబంధాల ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం సెవిలి అని దర్శకుడు తెలిపారు. తల్లి ప్రేమ కోసం తపించే కొడుకు, కొడుకును చూడడానికి ఇష్టపడని తల్లి మధ్యలో పెంచిన తల్లి మమకారం ఇలా హృదయాలను టచ్ చేసే సన్నివేశాలతో ప్రేమ, హాస్యం అంటూ అన్ని వర్గాల వారిని అలరించే అంశాలతో తెరకెక్కించిన చిత్రం ఈ చిత్రమని  ఆయన తెలిపారు. ఎంకేఎం ఫిలింస్ పతాకంపై వలసై కే.ఫిర్ మహ్మద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.సయ్యదుహుసేన్, పి.ఖాదర్‌హుసేన్, పి.మహ్మదుహుసేన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని దర్శకుడు తెలిపారు. నవ నటుడు జీఆర్ అర్పిన్ రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తిశెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇతర పాత్రల్లో మైనా పవిత్ర, నెల్లైశివ, షకీలా,ి సటిజన్ మణి, వలసై ఫిర్ మహ్మద్, కోవై శారద, కోవై ఉమ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు ఈ సందర్భంగా  వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement