లవ్, హర్రర్, థ్రిల్లర్‌గా పుదుసా నాన్‌పొరందేన్ | new Love , Horror , thriller pudusa nanporanden | Sakshi
Sakshi News home page

లవ్, హర్రర్, థ్రిల్లర్‌గా పుదుసా నాన్‌పొరందేన్

Published Sat, Nov 7 2015 9:37 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

new  Love , Horror , thriller pudusa nanporanden

ఇప్పుడు హారర్ చిత్రాల హవా సాగుతోందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరహా చిత్రాలు నిర్మాతల గల్లాపెట్టెలను నింపుతున్నాయి. అలాంటి చిత్రాల కోవలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుదుసా నాన్‌పొరందేన్. సహానా ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై షాకీర్ జెన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని మజీద్ అబు నిర్వహిస్తున్నారు.

 

పియోన్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. తెన్‌కాశీపట్టణం చిత్రంలో చిన్న శరత్‌కుమార్‌గా నటించిన పియోన్ బాల నటుడిగా తమిళం, మలయాళం భాషలలో 40 చిత్రాలకు పైగా నటించారు. ఒక మలమాళ చిత్రంలో హీరోగా నటించారు. ఇక ఈ చిత్రంలో ఆయనకు జంటగా కల్యాణి నాయర్ నాయకిగా నటిస్తున్నారు. కళాభవన్‌మణి, కరాటేరాజా, విజయన్, నరేశ్, ఛార్మిళా, బెంజమిన్, మరియాశశి తదితరులు ముఖ్య పాత్రలు ధరించిన ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక భయంకరమైన హంతకుడి గురించి టీవీలో చూసిన హీరోయిన్ అతను కచ్చితంగా తననీ రోజు చంపుతాడని తనలో తానే అనుకుంటుందన్నారు.

 

పని మీద పక్క ఊరుకు వెళ్లే ఆమె తండ్రి పక్క ఇంటిలో ఉంటున్న హీరోను తన కూతురుకి తోడుగా ఉండమని చెబుతాడన్నారు. ఆ తర్వాత హీరోయిన్ ఊహించినట్లుగా ఆ హంతకుడు ఆమెను హత్య చేశాడా? లేదా? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం పుదుసా నాన్‌పొరందేన్ అని చెప్పారు. ఇది 24 గంటల్లో జరిగే కథా చిత్రం అన్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement