భయంకరమైన అడవుల్లో షూటింగ్ | Andamaina Maya movie Audio Launched | Sakshi
Sakshi News home page

భయంకరమైన అడవుల్లో షూటింగ్

Published Sat, May 24 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

భయంకరమైన అడవుల్లో షూటింగ్

భయంకరమైన అడవుల్లో షూటింగ్

హారర్ నేపథ్యంలో విశ్వశ్రీ ఆర్ట్స్ పతాకంపై దినకరన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అందమైన మాయ’. చిరుసాయి, హేమంత్, కార్తీక్, కావ్యశ్రీ, శ్రుతి, ఝాన్సీ ముఖ్య తారలు. మణీంద్రన్ దర్శకత్వ పర్యవేక్షణలో నాగరాజు నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సత్య సోమేష్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో మాజీ మంత్రి నోముల నరసింహయ్య సీడీని ఆవిష్కరించి సినీ నిర్మాత టి. ప్రసన్నకుమార్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాణ నిర్వాహకుడు నాగరాజు కొట్టి మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే సినిమా ఇది.
 
 ఇందులో ఉన్న పాటలన్నీ బాగుంటాయి. ముఖ్యంగా ఇందులోని ప్రత్యేక నృత్య గీతం ‘కెవ్వు కేక...’ పాట స్థాయిలో ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన హారర్ చిత్రాలకన్నా ఈ సినిమా భిన్నంగా ఉంటుందని, హారర్ సన్నివేశాలు 20 రోజుల పాటు భయంకరమైన అడవుల్లో చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న కొడాలి వెంకటేశ్వరరావు, అశోక్‌కుమార్, ప్రభు, సురేశ్ కొండేటి తదితరులు సినిమా విజయం సాధించాలన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇంకా ఈ సినిమా విజయం పట్ల చిత్రబృందం తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement