గోవాలో ఏం జరిగింది?
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘చిన్నారి’. బేబీ యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ఇతర పాత్రల్లో నటించారు. లోహిత్ దర్శకత్వంలో కేఆర్‌కే ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్‌పై కె.రవికుమార్, ఎంఎంఆర్ తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘హారర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది.
గోవా నేపథ్యంలో కథ సాగుతుంది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాముఖ్యం ఉంటుంది. ‘రంగి తరంగి’ చిత్రానికి సంగీతం అందించిన అజినీష్ లోక్‌నాథ్ మా సినిమాకు మంచి పాటలిచ్చారు. కన్నడ టాప్ కెమెరామేన్ వేణు టేకింగ్, అజినీష్ ఆర్.ఆర్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.