టైటిల్: ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్
నటీనటులు: బైలీ మాడిసన్, లెవిస్ పుల్‌మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, ఎమ్మా బెలోమి, మార్టిన్ హెండర్‌సన్, డామియన్ మాఫీ, లీ ఎన్‌స్లిన్ తదితరులు
డైరెక్టర్: జోహన్నెస్ రాబర్ట్స్
జోనర్: హారర్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
రన్‌టైమ్: 1 గంట 25 నిమిషాలు
సినీ ప్రేక్షకులు హారర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ జోనర్ చిత్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో హారర్ చిత్రాలకే కొదువే లేదు. ప్రస్తుతం ఓటీటీలు వచ్చాక నచ్చిన సినిమాను ఇంట్లోనే చూసేస్తున్నారు. దీంతో ఆడియన్స్‌కు ఒళ్లు గగుర్పొడ్చేలా లాంటి సినిమాలు సైతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి ది స్ట్రేంజర్స్ ముందువరుసలో ఉంటుంది. అలా 2008లో వచ్చిన చిత్రం ది స్ట్రేంజర్స్. ఈ సినిమాకు సీక్వెల్‌గా 2018లో ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం.
కథంటేంటే..
బైలీ మాడిసన్, లెవిస్ పుల్‌మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, మార్టిన్ హెండర్‌సన్ నలుగురు సభ్యులు ఓకే కుటుంబం. వీరంతా కలిసి విహారయాత్రకు వెళ్తారు. అక్కడికెళ్లిన వీరికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఫ్యామిలీ కలిసి సరదాగా వేకేషన్ ఎంజాయ్ చేద్దామనుకున్న వీరిని ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు వెంబడిస్తారు. అయితే ఆ ముగ్గురు ఎవరు? అసలు వీళ్లను ఎందుకు చంపడాయనికి వచ్చారు? వీరి నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకుందా? నలుగురు ప్రాణాలతో బయటపడ్డారా? తెలియాలంటే 'ది స్ట్రేంజర్స్ :ప్రే ఎట్ నైట్' చూడాల్సిందే.
కథ విశ్లేషణ..
హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చేది దెయ్యం, భూతం లాంటివే. ఆ జోనర్‌లో చిత్రాలన్నీ దాదాపు అలాగే ఉంటాయని భావిస్తారు. కానీ ఇందులో మాత్రం ప్రేక్షకులకు సరికొత్త సస్పెన్స్ థ్రిల్‌ను అందించాడు. సినిమా ప్రారంభం నుంచే అసలు అవీ దెయ్యాలా? లేక మనుషులా అనే సస్పెన్స్ ఆడియన్స్‌కు కలిగేలా చూపించాడు. కథ మొత్తం ఆ నలుగురు కుటుంబ సభ్యులు, ముసుగులో ఉన్న ముగ్గురి చుట్టే తిరుగుతుంది.
ఆ కుటుంబం వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వచ్చే వయొలెంట్ సీన్స్ వెన్నులో వణుకు పట్టిస్తాయి. క్షణం క్షణం ఏం జరుగుతుందో అనే ఆసక్తిని ఆడియన్స్‌కు కలిగించాడు. ఒకవైపు ప్రాణభయం.. మరోవైపు అంతా చీకటి.. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమా చూసేటప్పుడు ఒక్క రాత్రి ఇంత భయంకరంగా ఉంటుందా? అనే ఫీలింగ్ ఆడియన్స్‌కు రావడం ఖాయం. ఒక రాత్రిని ఓ యుగంలా మార్చిన డైరెక్టర్.. సరికొత్త హారర్ థ్రిల్‌ను అందించాడు. ఇది సీక్వెల్ కావడంతో.. ప్రీక్వెల్ చూసిన వారికి మరింత ఆసక్తిగా ఉంటుంది.
చివరగా.. హారర్ జోనర్ ఇష్టపడే సినీ ప్రియులకు ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తక్కువ నిడివిలో హారర్ ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు. అయితే ఈ సినిమా కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. హారర్ చిత్రాల్లో ఎక్కువగా డైలాగ్స్ ఉండవు కాబట్టి.. సబ్‌టైటిల్స్‌తోనే చూసేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment