వాస్తవ ఘటనతో ఆఫ్టర్‌ మాత్‌ | Aftermath OTT Review: Hollywood | Sakshi
Sakshi News home page

వాస్తవ ఘటనతో ఆఫ్టర్‌ మాత్‌

Published Fri, Nov 15 2024 4:05 AM | Last Updated on Fri, Nov 15 2024 4:05 AM

Aftermath OTT Review: Hollywood

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం ‘ఆఫ్టర్‌ మాత్‌’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఈ ప్రపంచంలో తరచూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ సంఘటనల్లో కొన్ని మాత్రం మనల్ని అనునిత్యం వెంటాడుతుంటాయి. ఆ సంఘటనకు, మనకు సంబంధం లేకపోయినా వాటి బాధితుల బాధను మనమూ అనుభవిస్తాం. కొంతమంది ఆ బాధను అలా భరిస్తూనే ఉంటారు, మరికొంతమంది ఇంకోలా వ్యక్తపరుస్తూ ఉంటారు. అలా 2004లో జరిగిన ఓ వాస్తవ ఘటనకు సినిమా రూపమిచ్చారు హాలీవుడ్‌ దర్శకుడు ఎలియట్‌ లెస్టర్‌. 2004లో ఓ రష్యా ఆర్కిటెక్‌ తన కుటుంబాన్ని ఘోర విమాన ప్రమాదంలో ΄పోగొట్టుకున్నాడు.

దానికి ప్రతిగా ఎయిర్‌ లైన్‌ ట్రాఫిక్‌ సిబ్బందిని హత్య చేశాడు. ఈ ఘటన ఆధారంగా ‘ఆఫ్టర్‌ మాత్‌’ సినిమా తీశారు. ఈ సినిమా కథపరంగా రోమన్‌ ఓ కన్స్‌ట్రక్షన్‌ వర్కర్‌. ఫ్లైట్‌లో వస్తున్న తన కుటుంబాన్ని రిసీవ్‌ చేసుకోవడానికి ఎయిర్‌ ΄కోర్టుకి బయలుదేరడంతో ప్రారంభం అవుతుంది సినిమా. ఎయిర్‌ ΄కోర్టులో అడుగుపెట్టగానే తన భార్య, కూతురు విమాన ప్రమాదంలో మరణించారని రోమన్‌కి తెలుస్తుంది. దాంతో అతను కుంగిపోతాడు. అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయం తెలుసుకునే క్రమంలో ఆ ప్రమాదం వెనక ఉన్నది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ జేక్‌ బనోస్‌ అనే విషయం రోమన్‌కి తెలుస్తుంది.

ఎలాగైనా సరే రోమన్‌ జేక్‌ బనోస్‌ని కలవాలని ప్రయత్నిస్తాడు. జేక్‌ని కలిశాక రోమన్‌ ఏం చేశాడన్నదే ‘ఆఫ్టర్‌ మాత్‌’ సినిమా. ఈ సినిమా ఓ ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌. తన కుటుంబం మొత్తాన్ని ΄పోగొట్టుకుని దానికి కారణమైన వారి మీద పోరాటమన్నది అంత చిన్న విషయం కాదు. ఎన్నో భావావేశాలతో కూడుకున్న చిత్రం ఇది. ముఖ్యంగా రోమన్‌ ΄పాత్రలో ఓ విశిష్ట నటుడు మనకు కనిపిస్తాడు. 

దాదాపు రెండు తరాల నుండి హాలీవుడ్‌ యాక్షన్‌ రారాజుగా పిలవబడే ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ రోమన్‌ పాత్రను చేశారు. ఆర్నాల్డ్‌ ఆ పాత్రను చేశారనే కన్నా జీవించారని చెప్పవచ్చు. సినిమా మొత్తం కాస్త స్లోగా ఉన్నా సినిమా అయిపోయాక కొన్ని గంటలు మనం రోమన్‌ పాత్రతోనే ప్రయాణం చేస్తాం. ‘లయన్స్‌ గేట్‌’ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న ఈ ఎమోష నల్‌ రోలర్‌ కోస్టర్‌ని చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement