
దెయ్యం అవతారమెత్తిన అమీ జాక్సన్
ప్రస్తుతం సౌత్‌లో హారర్ కామెడీ , హారర్ యాక్షన్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరహా చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దాంతో దర్శక, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు కూడా ఇలాంటి చిత్రాలకు ఓటు వేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే ఓ చిత్రం రెడీ అవుతోంది.
అందులో రామ్‌చరణ్ సరసన ఎవడు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అమీ జాక్సన్.. దెయ్యంగా నటిస్తోందని సమాచారం. ఇప్పటి వరకు వినూత్నమైన చిత్రాలతో హీరోగా పేరుతెచుకున్న తమిళ హీరో సూర్య తొలిసారి ఈ హారర్ చిత్రంలో నటిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచితుడే అయినా.. హారర్ చిత్రంలో చేయడం మాత్రం ఇదే తొలిసారి. అందాల అమీజాక్సన్ దెయ్యంలా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.