Watch: Woman Swept Away By Wave At Bandra Bandstand, Children Scream In Horror - Sakshi
Sakshi News home page

Bandra Bandstand Incident: విషాదయాత్రగా మిగిలిన విహారయాత్ర..   

Published Sun, Jul 16 2023 1:44 PM | Last Updated on Mon, Jul 17 2023 2:05 AM

Woman Swept Away Wave Bandra Bandstand Kids Scream - Sakshi

ముంబై: ముంబై సాగారతీరంలో ఆటవిడుపుకు వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రలో భాగంగా  బాంద్రా బాండ్ స్టాండ్ కు వచ్చిన ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఓ పెద్ద అల వచ్చి బలంగా తాకింది. దీంతో భర్త సురక్షితంగానే బయటపడగా భార్య మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. పాపం ఆ పిల్లలు అమ్మా.. అమ్మా.. అని అరుస్తున్న వీడియో చూస్తే గుండె బరువెక్కుతుంది. 

ఒక్కోసారి సరదా కూడా విషాదకరంగా మారుతుందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. వీడియో తీసుకోవాలన్న ఆ జంట కుతూహలం  కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. మృతురాలు జ్యోతి సోనార్(32) భర్తతో కలిసి అక్కడున్న ఒక బండ రాతి మీద కూర్చుని ఫోజులు ఇస్తుండగా వారి పిల్లలు ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. అప్పటికే వెనుక పెద్ద పెద్ద అలలు వచ్చి కొడుతున్న దృశ్యాలతో భీతావహ వాతావరణం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 

నిర్లక్ష్యమే కారణం.. 
ఇదేమీ పట్టించుకోకుండా వారిద్దరూ అలాగే కూర్చుని ఉన్నారు. అంతలోనే ఒక పెద్ద అల వచ్చి బలంగా కొట్టడంతో భర్త అక్కడే పడిపోగా జ్యోతి మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. అంతా రెప్పపాటులో జరిగిపోవడంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమెను కాపాడేందుకు స్థానిక యువకుడు ఒకరు ప్రయత్నించగా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతను కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. అక్కడున్నవారు అప్రమత్తమై ఆ యువకుడినైతే కాపాడగలిగారు కానీ జ్యోతిని మాత్రం రక్షించలేకపోయారు. వీడియో తీస్తున్న పిల్లలు అమ్మా.. అమ్మా.. అని పిలుస్తున్న సన్నివేశం అత్యంత హృదయవిదారకంగా ఉంది. 

అంతకు ముందు వారు జుహు చౌపట్టి వెళ్లాల్సి ఉండగా అక్కడి వాతావరణం బాగుండకపోవడంతో అక్కడి భద్రతా సిబ్బంది వారిని అటు వెళ్లకుండా నివారించారు. దీంతో ఆ కుటుంబం ప్రణాలికను మార్చుకుని బాంద్రాకు వచ్చారు. అక్కడ ప్రమాదమని బాంద్రాకు వస్తే ఇక్కడ ఇలా జరిగింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చదవండి: టమాటాలకు కాపలాగా ఎవరున్నారో చూశారా.. పెద్ద ప్లానే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement