Tides
-
విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం..
ముంబై: ముంబై సాగారతీరంలో ఆటవిడుపుకు వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రలో భాగంగా బాంద్రా బాండ్ స్టాండ్ కు వచ్చిన ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఓ పెద్ద అల వచ్చి బలంగా తాకింది. దీంతో భర్త సురక్షితంగానే బయటపడగా భార్య మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. పాపం ఆ పిల్లలు అమ్మా.. అమ్మా.. అని అరుస్తున్న వీడియో చూస్తే గుండె బరువెక్కుతుంది. ఒక్కోసారి సరదా కూడా విషాదకరంగా మారుతుందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. వీడియో తీసుకోవాలన్న ఆ జంట కుతూహలం కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. మృతురాలు జ్యోతి సోనార్(32) భర్తతో కలిసి అక్కడున్న ఒక బండ రాతి మీద కూర్చుని ఫోజులు ఇస్తుండగా వారి పిల్లలు ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. అప్పటికే వెనుక పెద్ద పెద్ద అలలు వచ్చి కొడుతున్న దృశ్యాలతో భీతావహ వాతావరణం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నిర్లక్ష్యమే కారణం.. ఇదేమీ పట్టించుకోకుండా వారిద్దరూ అలాగే కూర్చుని ఉన్నారు. అంతలోనే ఒక పెద్ద అల వచ్చి బలంగా కొట్టడంతో భర్త అక్కడే పడిపోగా జ్యోతి మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. అంతా రెప్పపాటులో జరిగిపోవడంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమెను కాపాడేందుకు స్థానిక యువకుడు ఒకరు ప్రయత్నించగా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతను కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. అక్కడున్నవారు అప్రమత్తమై ఆ యువకుడినైతే కాపాడగలిగారు కానీ జ్యోతిని మాత్రం రక్షించలేకపోయారు. వీడియో తీస్తున్న పిల్లలు అమ్మా.. అమ్మా.. అని పిలుస్తున్న సన్నివేశం అత్యంత హృదయవిదారకంగా ఉంది. అంతకు ముందు వారు జుహు చౌపట్టి వెళ్లాల్సి ఉండగా అక్కడి వాతావరణం బాగుండకపోవడంతో అక్కడి భద్రతా సిబ్బంది వారిని అటు వెళ్లకుండా నివారించారు. దీంతో ఆ కుటుంబం ప్రణాలికను మార్చుకుని బాంద్రాకు వచ్చారు. అక్కడ ప్రమాదమని బాంద్రాకు వస్తే ఇక్కడ ఇలా జరిగింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. This is so horrible How can a person risk their life for some videos.. The lady has swept away and lost her life in front of his kid.#bandstand #Mumbai pic.twitter.com/xMat7BGo34 — Pramod Jain (@log_kyasochenge) July 15, 2023 ఇది కూడా చదవండి: టమాటాలకు కాపలాగా ఎవరున్నారో చూశారా.. పెద్ద ప్లానే.. -
Grammy Awards 2023: నవరాగాల తేజం..రిక్కీ కేజ్
గత సంవత్సరం గ్రామీ గెలుచుకున్న తరువాత లాస్ వేగాస్లోని ఎంజీఎం గ్రాండ్ మార్క్యు బాల్రూమ్లో భారతీయత ఉట్టిపడేలా ‘నమస్తే’ అంటూ ప్రేక్షకులకు అభివాదం చేశాడు మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్. భారతీయత అతడి బలం. తనను ముందుకు నడిపించే ఇంధనం. లాస్ ఏంజెల్స్(యూఎస్) మైక్రోసాఫ్ట్ థియేటర్లో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన 65 వ గ్రామీ పురస్కార ప్రదానోత్సవంలో రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి ‘గ్రామీ’ అవార్డ్‌ను అందుకున్నాడు రిక్కీ కేజ్. స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌కు బెస్ట్ ఇమాసివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో గ్రామీ దక్కింది. రిక్కీకి కెరీర్లో ఇది మూడో గ్రామీ... సంగీతరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డ్‌ను ముచ్చటగా మూడోసారీ సొంతం చేసుకున్నాడు బెంగళూరుకు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్. 2015లో అమెరికన్ రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘విండ్స్ ఆఫ్ సంసార’ ఆల్బమ్‌కు తొలిసారిగా గ్రామీ అవార్డ్ దక్కింది. స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌కు మూడోసారి గ్రామీ అవార్డ్ (బెస్ట్ ఇమాసివ్ ఆడియో ఆల్బమ్ విభాగం)లో అందుకున్నాడు రిక్కీ. గత సంవత్సరం ఇదే ఆల్బమ్ ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్’ విభాగంలో రెండోసారి గ్రామీ దక్కింది. డివైన్ టైడ్స్... ప్రకృతి ప్రపంచానికి నివాళి. ఈ ఆల్బమ్‌లో తొమ్మిది పాటలు ఉన్నాయి. మన హిమాలయాల అందాల నుంచి స్పెయిన్ అరణ్యాల అందాల వరకు మ్యూజిక్ వీడియోల్లో కనువిందు చేస్తాయి. ‘నా సంగీతంలో భిన్న సంస్కృతుల ప్రభావం కనిపించినప్పటికీ నా మూలాలు మాత్రం భారత్‌లోనే ఉన్నాయి’ అంటాడు రిక్కీ కేజ్. మూడోసారి ‘గ్రామీ’ వరించిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కోప్లాండ్తో ఉన్న ఫోటో పోస్ట్ చేసి ‘సూపర్ గ్రేట్ఫుల్, మై థర్డ్ గ్రామీ అవార్డ్’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు రిక్కీ కేజ్. నార్త్ కరోలినా (యూఎస్)లో జన్మించాడు రిక్కీ. ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి తల్లిదండ్రులతో పాటు బెంగళూరులో ఉంటున్నాడు. స్థానిక బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నాడు. ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో సంగీతంలోనే కెరీర్ వెదుక్కుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. ఇలా చెప్పడం తండ్రికి నచ్చలేదు. ఆ తరువాత మాత్రం ఆయన కాస్త మెత్తబడ్డాడు. డెంటల్ సర్జరీలో డిగ్రీలో పూర్తి చేసిన తరువాత, పట్టా తండ్రి చేతికి ఇచ్చి తనకు ఇష్టమైన సంగీతపు దారిలో ప్రయాణం ప్రారంభించాడు. టీవీలోని మ్యూజిక్ షోల ద్వారా చిన్నప్పుడే రిక్కీకి సంగీతంపై ఆసక్తి మొదలైంది. ఇంట్లో పెద్ద మ్యూజిక్ కలెక్షన్ ఉండేది. రాక్ బాండ్ ‘ఏంజెల్ డస్ట్’లో గిటార్ ప్లేయర్‌గా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన రిక్కీ ఆ తరువాత ఫుల్‌టైమ్ కంపోజర్‌గా మారాడు. నస్రత్ ఫతే అలీఖాన్, పండిట్ రవిశంకర్, పీటర్ గాబ్రియెల్ తనకు ఇష్టమైన సంగీతకారులు. జింగిల్స్ చేయడం అంటే రిక్కీకి చాలా ఇష్టం. జింగిల్స్ చేయడం అంటే తన దృష్టిలో రోజూ వ్యాయామం చేయడం లాంటిది. సృజనాత్మక పరిధిని పెంచుకోవడంలాంటిది. ఎన్నో భాషల్లో, ఎన్నో జానర్స్‌లో జింగిల్స్ చేస్తున్నప్పుడల్లా తనలో అదనపు శక్తి వచ్చినట్లుగా భావిస్తాడు. ఇప్పటివరకు మూడువేలకు పైగా జింగిల్స్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వంద మ్యూజిక్ అవార్డ్లు గెలుచుకున్నాడు. రిక్కీకి నచ్చిన పుస్తకం రిచర్డ్ డాకిన్స్ ది గాడ్ డిలూజన్. నిజానికి రిక్కీ తండ్రి, తాతతో సహా బంధువుల్లో చాలామంది వైద్యులుగా పనిచేశారు. ‘రిక్కీలో ఆర్టిస్టి్టక్ జీన్స్ తాత నుంచి వచ్చాయి’ అని మురిసిపోతుంది తల్లి పమ్మి. తాత జానకిదాస్ నటుడు, భావుకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. 2014లో తన గర్ల్‌ఫ్రెండ్ వర్షను వివాహం చేసుకున్నాడు రిక్కీ కేజ్. నవ రత్నాలు ‘డివైన్ టైడ్స్’ విడుదల అయిన కొత్తలో ఈ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డ్ గెలుచుకునే సంపూర్ణ అర్హతలు ఉన్నాయని కితాబు ఇచ్చారు సంగీత విశ్లేషకులు. వారి మాట నిజమైంది. ‘డివైన్ టైడ్స్’ లోని వండర్స్ ఆఫ్ లైఫ్, హిమాలయాస్, అవర్హోమ్, ఆర్డ్ ఆఫ్ డివోషన్, పాస్టోరల్ ఇండియా, ఐయామ్ ఛేంజ్, ఏ ప్రేయర్, గాంధీ, మదర్ ఎర్త్... తొమ్మిది ట్రాక్స్ నవరత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఆల్బమ్‌లో మూలసూత్రం ఏమిటి? మనతో మనం... అంటే ఎవరికి వారు తమ వ్యక్తిగత ప్రంచంలోకి వెళ్లి తమను తాము కొత్తగా పరిచయం చేసుకోవడం. తమను తాము విశ్లేషించుకోవడం, విశ్లేషణ ఫలితాలను ఆచరణలోకి తీసుకురావడం. కాలంతో పాటు మనం... కాలంపై మనదైన సంతకం ఉండాలి. కాలం చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. కాలం విసిరే ప్రశ్నలకు జవాబు వెదుక్కోవాలి. కాలం విసిరే సవాళ్లకు పరిష్కారాలు ఆలోచించాలి. మన గ్రహంతో మనం... భూమికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీరేది కాదు. మనం చేయాల్సిందల్లా చెట్టును కాపాడుకోవాలి. చెట్టుపైన పిట్టను కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ నినాదం మన శ్వాసలో భాగం కావాలి. వ్యక్తిత్వ నిర్మాణంలో నేస్తం ఆసక్తిగా మొదలై, అభిరుచిగా మారి రిక్కీ జీవితంలోకి వచ్చిన సంగీతం ‘సంగీతమే నా వ్యక్తిత్వం’ అనే స్థాయికి చేరుకుంది. అదే శ్వాస అయింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సంగీతంలో కెరీర్‌ను వెదుక్కోవడానికి ఇష్టంగా లేరు. దీని గురించి ప్రస్తావిస్తూ ‘మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను పాషన్పై కాకుండా భయంపై తీసుకుంటారు. ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థికకోణాన్ని దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ను ఎంచుకోవడం కాకుండా ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవాలి. సంప్రదాయ వృత్తులకు దూరంగా తాము ఎంచుకున్న మార్గం ద్వారా మీ పిల్లలు పెద్దగా డబ్బు సంపాదించలేకపోవచ్చు. అయితే డబ్బు కంటే విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారు’ అంటాడు రిక్కీ కేజ్. గ్రామీ అవార్డ్ అందుకున్న యంగెస్ట్ ఇండియన్, మూడు గ్రామీలు అందుకున్న ‘వోన్లీ ఇండియన్’గా తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న రిక్కీ కేజ్ (41)... ‘సంగీతం అనేది హాయిగా విని ఆస్వాదించడానికి మాత్రమే కాదు మన వ్యక్తిత్వ నిర్మాణంలో సహాయపడుతుంది. మన పాటలలో ఎక్కువగా ప్రేమ, శాంతి, మంచితనం చుట్టూ అల్లుకున్నవే’ అంటాడు. -
ముందుకొస్తున్న పసిఫిక్.. పలు దేశాలు గజగజ
పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో టోంగా దగ్గర అగ్నిపర్వతం భారీ శబ్ధంతో శనివారం బద్ధలైన సంగతి తెలిసిందే. ఆ ధాటికి భారీ ఎత్తున అలలు ఎగసి పడుతుండడంతో తీర ప్రాంతాలు అప్రమత్తం అవుతున్నాయి. చాలా చోట్ల సముద్ర జలాలు ముందుకు దూసుకురావడంతో.. అల్లకల్లోలం నెలకొంది. Tsunami Warning For Some Pacific Coastal Countries: ఈ పరిణామంతో టోంగాతో పాటు అమెరికన్ సమోవా, న్యూజిలాండ్, ఫిజీ, వనువాటు, చిలీ, ఆస్ట్రేలియా.. సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. నాలుగు అడుగుల ఎత్తుతో అలలు ఎగసిపడగా.. టోంగా రాజధాని నుకువాలోఫా ప్రజలు వణికిపోయారు. భారీ శబ్ధంతో భూమీ కంపించడంతో పాటు సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకుని వచ్చిందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ ప్రకటించింది. టోంగా రాజు ప్యాలెస్ నుంచి ఇప్పటికే సురకక్షిత ప్రాంతానికి తరలిపోగా.. తన పౌరులను అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపు ఇచ్చాడు. నష్టం వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున అమెరికా, జపాన్, సైతం ఇప్పుడు సునామీ హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాయి. జపాన్ తీర ప్రాంతం వెంబడి 11 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని భావిస్తోంది వాతావరణ సంస్థ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు అమామీ ఒషీమా ద్వీపంలోకి 1.2 మీటర్ ఎత్తుతో అలలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా పశ్చిమ తీరం వెంట సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, అలస్కా వెంట చిన్నపాటి వరదల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవాయ్ అప్రమత్తం అయ్యింది. ఓరేగావ్ తీరం వెంట సముద్రపు అలలు ముందుకు వస్తున్నాయి. So this happened in Tonga today! Massive Underwater volcanic eruption sending shockwave across South Pacific as captured by Himawari Satellite! Tsunami just hit Tonga and some region of Fiji Island! Prayers for people there!#Tsunami pic.twitter.com/7Q4mRhNcVQ — Vishal Verma (@VishalVerma_9) January 15, 2022 Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 వీడియో: టోంగా దగ్గర పేలిన అగ్నిపర్వతం -
టైడ్ ప్రచారకర్తగా ఆయుష్మాన్ ఖురానా
ముంబై: ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాకు చెందిన ‘టైడ్’ బ్రాండ్‌కు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. వాషింగ్ మెషిన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టైడ్ ఆల్ట్రా పౌడర్‌కు ఈయన నటించిన తొలి ప్రకటనను ఇప్పటికే పూర్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం జరగక ముందు వరకు టైడ్ అవాక్కయ్యారా ప్రకటనలు చూసి ఇష్టపడిన తాను.. ఇప్పుడు స్వయంగా బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఉండడం సంతోషంగా ఉందని ఆయుష్మాన్ అన్నారు. -
కల్లోల కడలి
సాక్షి, వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం) : కడలి కల్లోలమవుతోంది. అలలు ఉగ్రరూపం దాల్చి తీరానికి వస్తున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలను చూసి మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని భావనపాడు, మంచినీళ్లపేట, బారువ తీరాల్లో దాదాపు 50 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. అలల తాకిడికి వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో సముద్రం దాదాపు 135 మీటర్ల మేర ముం దుకు వచ్చింది. తీరానికి ఆనుకుని ఉన్న ఇసుక దిబ్బలు కోతకు గురవుతున్నాయి. మంచినీళ్లపేటతో పాటు దేవునల్తాడ, అక్కుపల్లి, డోకులపాడు తీరంలో తీరం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం వెరసి కోస్తా తీరానికి భారీ వర్షం పొంచి ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించడంతో శ్రీకా కుళం జిల్లాలో తీరం ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ దండోరాలు వేయించిన రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ సూచిస్తున్నారు. తీరంలోనే వేట సామగ్రి వదిలిన మత్స్యకారులు వేట లేకరెండురోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఏడాదిలో ఐదోసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తీరం కోత కు గురవడం ఇది ఐదోసారని, గతంలో వచ్చిన తుఫాన్, అధిక వర్షాలకు ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉండేది కాదని మత్స్యకారులు చెబుతున్నారు. మంచినీళ్లపేట, దేవునల్తాడ, అక్కుపల్లి ప్రాంతాల్లో ఏడాదిలో ఐదు సార్లు తీరం కోతకు గురైంది. జిల్లాలో సంతబొమ్మాళి, గార, ఎచ్చెర్ల మండలాల్లో చాలా చోట్ల తీరం ఇలాగే ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది ఒక రకంగా ప్రమాదానికి సూచిక అంటూ పెద్దలు హెచ్చరిస్తున్నారు. హుద్‌హుద్, తిత్లీ, ఫొని లాంటి తుపాన్లే ఇందకు నిదర్శనం కాగా.. సముద్ర అంతర్భాగంలోని పొరల్లో ఏర్పడుతున్న అలజడి ఓ కారణం అంటూ నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల కిందట అక్కుపల్లి తీరంలో దాదాపు కిలోమీటరు మేర, ఇప్పుడేమో మంచినీళ్లపేట తీరంలో 2 కిలోమీటర్ల మేర తీరం కోతకు గురైంది. పస్తుల్లో గంగపుత్రులు వరుసగా తుఫాన్లు, అల్పపీడన ద్రోణులు ఏర్పడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లడం కుదరడం లేదు. వేట లేక మత్స్యసంపద చిక్కక, చిక్కిన సంపదకు దళారుల బెడద కలగలిపి గంగపుత్రులను బెంగ కు గురి చేస్తున్నాయి. మరో పక్క 61 రోజుల పాటు వేట నిషేధ భృతి ఇంకా అందలేదు. ఆయిల్ సబ్సిడీ సైతం అందని మత్స్యకారులు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వేట నిషేధ భృతి పెంచింది. తుఫాన్ల సమయంలోనూ తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. చేపల వేటకు వెళ్లొద్దు అల్పపీడణ ద్రోణి ఉన్నందున మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశించాం. ఇప్పటికే మా సిబ్బంది ద్వారా సాగర మత్స్యకార సొసైటీ అధ్యక్షులకు సమాచారం అందించాం. తీర ప్రాంత గ్రామాల్లో దండోరాలు వేయించాం. వేట నిషేధ భృతికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు రూ.10వేలు వేట నిషేధ భృతి కోసం కమిషనరేట్ నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అడిగారు. అవి పంపించాం. అందుకే వేట నిషేధ భృతి కొంత మేర ఆలస్యమైంది. త్వరలో మంజూరు అయ్యే అవకాశం ఉంది. – సంతోష్‌కుమార్, ఎఫ్డీఓ, పలాస తుపాన్ల సమయంలో అండగా నిలవాలి తుపానులు, అధిక వర్షా ల సమయంలో మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తుఫాన్ల సమయంలో మత్స్యకారులకు కూడా అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇసుక దిబ్బ లపై ఎండబెట్టిన ఉప్పు చేపలు పాడైతే నష్ట పరిహారం ఇవ్వాలి. మత్స్యకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు అందించి సొసైటీలను బలోపేతం చేయాలి. వేటకెళ్లే మత్స్యకారుని ఖాతాలో నిషేధ భృతి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. – జి.శంభూరావు, మత్స్యకారుడు. -
ఆంధ్రప్రదేశ్‌పై ప్రకృతి ప్రకోపం
సాక్షి, వెబ్ డెస్క్ : ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో ‘ఏ పిడుగులాంటి వార్త వినాల్సి వస్తుందో...?’ అని అంటుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఇదే. ఒకవైపు బంగాళాఖాతంలో భారీ ఎత్తున అలలు ఎగసి పడుతుంటే.. మరోవైపు బుధవారం రాష్ట్రాన్ని పిడుగులు కుదుపునకు గురి చేశాయి. కేవలం 13 గంటల్లో 36 వేల 749 పిడుగులు పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోయారు. నైరుతి హిందూ మహాసముద్రంలో (మడగాస్కర్కు ఈశాన్య ప్రాంతంలో) ఏర్పడిన తుపాను ఫకీర్ వల్ల ఈ నెల 23 నుంచి ప్రచండ గాలులు భారత పశ్చిమ, తూర్పు తీరాల్లో ఉన్న హిందూ మహాసముద్రంలో అంతర్భాగాలైన అరేబియా, బంగాళాఖాతం వైపు వీచాయి. గాలుల పెను తాకిడికి కదలిన కడలి అలలు భారీ ఎత్తున వచ్చి మన తీరాలను తాకాయి. 3 నుంచి 4 మీటర్ల ఎత్తులో వచ్చిన అలల తాకిడి తీరం ప్రాంతాలు నష్టాన్ని చవిచూశాయి. 2004లో సిమియూల్ సునామీ వల్ల భారత తీర ప్రాంతాలపై విరుచుకుపడ్డ అలలు ఎత్తు 10 మీటర్లు. బుధవారం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం సంభవించింది. ఇదే సమయంలో భారీ ఎత్తున పిడుగులు పడ్డాయి. వీటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు వదిలారు. మంగళవారం ఆరుగురు మృతి చెందారు. దేశంలో అత్యధికంగా పిడుగుల పడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉంది. గత ఏడాది మే నుంచి అక్టోబరు నెలల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పడిన పిడుగుల సంఖ్య 2,62,940 . వీటి వల్ల దాదాపు 61 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మడగాస్కర్ వద్ద ఏర్పడిన ఫకీర్ తుపాను గురువారం బలహీనపడింది. ఈ లోగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సూర్యుడి భగభగలకు భూమి, సముద్రాల్లో ముందు భూమి వేడెక్కాలి. కానీ వాతావరణ మార్పుల కారణంగా సముద్రం ముందు వేడెక్కుతుండటంతో ఇతర ప్రదేశాల్లోని అధిక పీడన గాలులను ఆకర్షిస్తూ అల్పపీడనాలను ఏర్పరచి అకాల వర్షాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనానికి కారణం ఇదే. బుతువుల క్రమం చెడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వర్షాల సమయంలో భారీగా ఏర్పడుతున్న మేఘాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుని పిడుగుల పడటానికి కారణం అవుతున్నాయి. సాధారణంగా నైరుతి రుతు పవనాల సీజన్లో ఉరుములు, మెరుపుల ప్రభావంతో పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. పిడుగులు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిటైర్డ్ అధికారి డాక్టర్ నరసింహారావు వివరించారు. గుర్తించండి.. ఇలా చేయండి - ఉరుముల శబ్దం వినిపిస్తే మేఘాలు తక్కువ ఎత్తులో ఉన్నాయని, పిడుగులు పడే ప్రమాదం ఉందని గుర్తించాలి. ఆకాశం మేఘావృతమై గాలివాన కురుస్తున్నా జాగ్రత్త వహించాలి. - పొలాల్లో పని చేసేవారు లేదా బయట నిలుచున్న వారు వెంటనే సమీపంలోని సురక్షిత భవనంలోకి చేరుకోవాలి. - వర్షం, గాలులు, ఉరుముల శబ్ధం సమయాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కిందకు వెళ్లకూడదు. - చిన్న కాంక్రీటు ఇంటి కంటే పెద్ద భవనాలు సురక్షితం. పిడుగుపాటు అంటే.. మేఘాలు పరస్పరం రాసుకున్నప్పుడు లేదా ఒక మేఘంలోని అణువులు రాసుకుంటే విద్యుదాఘాతం ఏర్పడుతుంది. ఒక మేఘం నుంచి మరో మేఘంలోకి విద్యుదాఘాతం వెళితే భారీ వెలుతురు కనిపిస్తుంది. దాన్నే మెరుపు అంటారు. విద్యుదాఘాతం మేఘంలోకి కాకుండా నేలవైపు రావడాన్ని పిడుగు అంటారు. మేఘాలు లేదా అణువులు రాసుకోవడంవల్ల మిలియన్ ఓల్టుల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంత అధిక పరిమాణంతో కూడిన విద్యుత్తు కిరణం నేలవైపు దూసుకు రావటంతో ఆ మార్గం తీవ్రంగా వేడెక్కి గాలి వ్యాకోచం చెందుతుంది. అందువల్లే పిడుగుపాటు సమయంలో పెద్ద శబ్ధం వస్తుంది. పిడుగులు పడే చోట తీవ్రమైన వేడికి చెట్లు సైతం నల్లగా మాడిపోతాయి. మనుషులైతే కాలి బొగ్గులా మారిపోతారు. ఆకర్షించే ఎత్తయిన చెట్లు ఆకాశం నుంచి నేలపైకి వచ్చే సమయంలో అనువైన మార్గాన్ని పిడుగు అన్వేషిస్తుంది. ఎత్తయిన చెట్లు వాటిని ఆకర్షిస్తాయి. దీనివల్లే తాటిచెట్లు, కొబ్బరిచెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి. చెట్లే కాదు సన్నగా, పొడవుగా ఉన్నవి కూడా పిడుగులను ఆకర్షిస్తాయి. -
భారత్ తీర ప్రాంతాలకు ఇన్కాయిస్ హెచ్చరికలు
-
తీరప్రాంతాలకు ఇన్కాయిస్ హెచ్చరిక
-
ఆంధ్రప్రదేశ్‌పైకి ప్రచండ అలలు
సాక్షి, హైదరాబాద్ : ఆఫ్రికా ఖండ తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల వల్ల భారత తూర్పు తీరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్కాయిస్) సవరించిన ప్రకటనను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలోని తీర ప్రాంతాల్లో 3 నుంచి 4 మీటర్ల ఎత్తున్న రాకాసి అలలు విరుచుకుపడతాయని ఆదివారం ఇన్కాయిస్ హెచ్చరించింది. ఇదే పరిస్థితి ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి వరకూ కొనసాగుతుందని చెప్పింది. ముఖ్యంగా అండమాన్ నికోబార్, తమిళనాడు, ఒడిశా తీరాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో సముద్ర నీరు బాగా ముందుకు వచ్చింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఆదివారం కేరళ వచ్చిన పెను అలల తాకిడి తీర ప్రాంతాల్లోని 100 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమ, మంగళవారాల్లో అలల తీవ్రత అండమాన్ నికోబార్‌లో ఎక్కువగా ఉంటుందని ఇన్కాయిస్ పేర్కొంది. -
తీరంలో అలజడి
గార: శుక్రవారం ఉదయం 8 గంటలు... సుమారు 5వేల మంది ప్రజలు నివసించే బందరువానిపేట సముద్ర తీరం... వేకువజామున వేటకు వెళ్లే మత్స్యకారుల పడవలు తీరానికి మరి కొద్ది నిమిషాల్లో చేరుకుంటాయనగా... ఒక్కసారిగా అలలు పెరుగుతూ బందరువానిపేట వైపు దూసుకొచ్చింది. సముద్రానికి బందరువానిపేట 150 మీటర్లు దూరంలో ఉండగా సుమారు 70 మీటర్లు మేర అలలు వచ్చి ఎగసిపడ్డాయి. ఇలా రెండు గంటలపాటు అలల ఉధృతి కనిపించి, తరువాత సాధారణ స్థితికిచేరుకుంది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో చేపల ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రక్షణ గోడ దాటి 5 మీటర్ల మేర భూమికి కోతకు గురయ్యింది. ప్లాట్ఫారం నుంచి రక్షణ గోడ వరకు ఉన్న సిమెంట్ రోడ్ కూడా విరిగిపోయింది. అంతేకాక రక్షణ గోడ కిందినుంచి సముద్రం నీరు చొచ్చుకుపోయి భూమిని కోసేసింది. అప్రమత్తమైన మత్స్యకారులు పడవులను ఒడ్డుకు చేర్చుకున్నారు. నీలం, లైలా, హుద్‌హుద్ తుపాన్ సమయాల్లో కూడా ఇంతమేర అలల ఉధృతి చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. అలలు ఇలా ముందుకు రావడం ఎప్పుడూ చూడలేదు ఇంతలా అలలు ముందుకు రావడం నేను ఇంతవరకూ చూడలేదు. అలలు రావడమే కాకుండా రక్షణ గోడను సైతం దాటి భూమి కోత జరిగింది. ఆ కొద్ది గంటల సేపు సముద్రం వైపు చూస్తే భయమేసింది. అయినా గ్రామస్తులకు ధైర్యం చెబుతూ వచ్చాను. -కోడ లక్ష్ముయ్య, మత్స్యకార నాయకుడు, బందరువానిపేట హుద్హుద్లోనూ ఇంత తీవ్రంగాలేదు హుద్‌హుద్ తుపాన్ బీభత్సం సృష్టించినా ఇంత పెద్ద అలలు ఇలా ముందుకు రాలేదు. పైగా రక్షణ గోడ దాడటంతో పాటు ఇసుక దిబ్బల వద్ద కోతకు గురవుతున్నాయి. పటిష్టమైన రక్షణ గోడను నిర్మించాలి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి. -డి సందెయ్య, బందరువానిపేట -
అలల తాకిడికి విశాఖ తీరం విలవిల!