Bandra Bandstand
-
విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం..
ముంబై: ముంబై సాగారతీరంలో ఆటవిడుపుకు వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రలో భాగంగా బాంద్రా బాండ్ స్టాండ్ కు వచ్చిన ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఓ పెద్ద అల వచ్చి బలంగా తాకింది. దీంతో భర్త సురక్షితంగానే బయటపడగా భార్య మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. పాపం ఆ పిల్లలు అమ్మా.. అమ్మా.. అని అరుస్తున్న వీడియో చూస్తే గుండె బరువెక్కుతుంది. ఒక్కోసారి సరదా కూడా విషాదకరంగా మారుతుందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. వీడియో తీసుకోవాలన్న ఆ జంట కుతూహలం కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. మృతురాలు జ్యోతి సోనార్(32) భర్తతో కలిసి అక్కడున్న ఒక బండ రాతి మీద కూర్చుని ఫోజులు ఇస్తుండగా వారి పిల్లలు ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. అప్పటికే వెనుక పెద్ద పెద్ద అలలు వచ్చి కొడుతున్న దృశ్యాలతో భీతావహ వాతావరణం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నిర్లక్ష్యమే కారణం.. ఇదేమీ పట్టించుకోకుండా వారిద్దరూ అలాగే కూర్చుని ఉన్నారు. అంతలోనే ఒక పెద్ద అల వచ్చి బలంగా కొట్టడంతో భర్త అక్కడే పడిపోగా జ్యోతి మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. అంతా రెప్పపాటులో జరిగిపోవడంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమెను కాపాడేందుకు స్థానిక యువకుడు ఒకరు ప్రయత్నించగా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతను కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. అక్కడున్నవారు అప్రమత్తమై ఆ యువకుడినైతే కాపాడగలిగారు కానీ జ్యోతిని మాత్రం రక్షించలేకపోయారు. వీడియో తీస్తున్న పిల్లలు అమ్మా.. అమ్మా.. అని పిలుస్తున్న సన్నివేశం అత్యంత హృదయవిదారకంగా ఉంది. అంతకు ముందు వారు జుహు చౌపట్టి వెళ్లాల్సి ఉండగా అక్కడి వాతావరణం బాగుండకపోవడంతో అక్కడి భద్రతా సిబ్బంది వారిని అటు వెళ్లకుండా నివారించారు. దీంతో ఆ కుటుంబం ప్రణాలికను మార్చుకుని బాంద్రాకు వచ్చారు. అక్కడ ప్రమాదమని బాంద్రాకు వస్తే ఇక్కడ ఇలా జరిగింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. This is so horrible How can a person risk their life for some videos.. The lady has swept away and lost her life in front of his kid.#bandstand #Mumbai pic.twitter.com/xMat7BGo34 — Pramod Jain (@log_kyasochenge) July 15, 2023 ఇది కూడా చదవండి: టమాటాలకు కాపలాగా ఎవరున్నారో చూశారా.. పెద్ద ప్లానే.. -
అమ్మ, అక్కతో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా..
ముంబై: సెల్ఫీ మరో కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల బ్యాచ్‌లర్ ఇంజినీర్ విద్యార్థిని బంద్రా బ్యాండ్స్టాండ్లో తల్లి, సోదరితో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా.. మృత్యువాత పడింది. కన్నతల్లికి, కుటుంబానికి తీరని శోకం మిగిలింది. సముద్ర తీరంలో బాంద్రా ఫోర్ట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రెండు గంటల అనంతరం సముద్రంలో కొట్టుకుపోతున్న ఆమె మృతదేహాన్ని స్థానిక మత్స్యకారులు, ఫైర్ బ్రిగేడ్ అధికారులు గుర్తించారు. ఫైనలియర్ పరీక్షలు రాసిన మీనాక్షి ప్రియ రాజేశ్ గత నెల 30న తల్లిదండ్రులు, అక్కతో కలిసి ముంబైను సందర్శించేందుకు వచ్చింది. అంధేరిలోని ఓ హోటల్లో వారి కుటుంబం బస చేసింది. బుధవారం రోజంతా ముంబైని చూసేందుకు ఓ క్యాబ్‌ను కుటుంబం బుక్ చేసింది. బంద్రా ఫోర్ట్ వద్ద ఆమె కుటుంబం పలు ప్రదేశాలను వీక్షించిందని, వెనుక సముద్రం కనిపించేలా ఓ పెద్ద గుట్ట మీద నుంచి తల్లి, అక్కతో కలిసి సెల్ఫీ తీసుకుంటానని మీనాక్షి తెలిపిందని, ఇలా సెల్ఫీ తీసుకుంటుండానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరమని ముంబై పోలీసులు హెచ్చరిక బోర్డు గతంలోనే పెట్టారు.