
‘గీతాంజలి, చిత్రాంగద’ వంటి హారర్ చిత్రాల్లో మంచి నటనతో ప్రేక్షకులను అలరించారు అంజలి. ఇప్పుడు వరుసగా హారర్ చిత్రాలకే ఇంపార్టెన్స్ ఇస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నట్లున్నారామె. దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు అంజలి. అందులో మూడు సినిమాలు ‘లీసా, గీతాంజలి 2, ఓ’ హారర్ జానర్‌కు సంబంధించినవి కావడమే ఇందుకు నిదర్శనం.
‘లీసా, గీతాంజలి 2’ చిత్రాల్లో ఫస్ట్ లుక్స్‌ను రీసెంట్‌గా ఆయా చిత్రబృందాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఓ’ చిత్రంలోని అంజలి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. ఫస్ట్ లుక్ రివర్స్‌లో ఉండటం, రక్తం కక్కుకుంటున్న అంజలి పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఎ. ప్రవీణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అజయ్ పనికేర్ నిర్మాత.