అమ్మకానికి దెయ్యాల దీవి | Ghost Island for sale | Sakshi
Sakshi News home page

అమ్మకానికి దెయ్యాల దీవి

Published Mon, Apr 28 2014 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

అమ్మకానికి దెయ్యాల దీవి

అమ్మకానికి దెయ్యాల దీవి

హారర్
 
దెయ్యాల గురించి ఎన్ని కథలు ఉన్నాయో, దెయ్యాల దీవిగా ప్రసిద్ధి చెందిన పోవెగ్లియా(ఇటలీ) గురించి అంతకంటే ఎక్కువ కథలు ఉన్నాయి. అయిదు భవంతులు ఉన్న  ఈ దీవిలో సేద తీరడాన్ని ఒకప్పుడు  గొప్పగా భావించేవాళ్లు.
 
ఒకానొక కాలంలో ఇటలీలో ప్లేగ్ మహమ్మారి విజృంభించింది. ప్లేగ్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి, ప్లేగ్ సోకిన వారిని పోవెగ్లియా దీవిలో వదిలింది ఇటలీ ప్రభుత్వం.
 

ఆ దీవిలో చాలామంది దిక్కూమొక్కూ లేకుండా చనిపోయారు. అలా చనిపోయిన వారు దెయ్యాలుగా మారి ప్రతీకారం, కోపంతో తిరుగుతున్నారనే  వార్తలు వ్యాపించాయి. అది నిజమే అనుకునేలా కొందరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో చనిపోయారు. నిజం ఎంతో తెలుసుకుందామనుకొని దీవికి వెళ్లిన వాళ్ల అడ్రస్ గల్లంతయింది.
 

ఈ దీవిలో  ఒక ఆస్పత్రి ఉంది.  ఈ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు ఒకరు దెయ్యాల గురించి రకరకాల పరిశోధనలు చేసేవాడట. ఈ క్రమంలో దెయ్యాల ఆగ్రహానికి గురై, మతిచలించి మేడ మీది నుంచి దూకి ఆత్మహత్మ చేసుకున్నాడట.
 

దెయ్యాల ఉనికి...పుకారా? నిజమా? అనుకునే రోజుల్లో ఒక అమెరికన్ టీవి ప్రెజెంటర్ ఈ దీవికి వెళ్లి ఒక కార్యక్రమం చేశాడు. దెయ్యాలు ఉన్నట్లు గట్టిగా నిర్ధారించాడు.  ఈ దీవి గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం ఈ దీవికి రాకపోకలను నిషేధించింది.
 

తాజా ఖబర్ ఏమిటంటే, తన ఖర్చుల కోసం  ప్రభుత్వం ఈ దీవిని అమ్మకానికి సిద్ధం చేసింది. కొనే ధైర్యవంతులు ఎవరో మరి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement