అన్నీ మంచి శకునములే! | aranmanai movie release on 19th december | Sakshi
Sakshi News home page

అన్నీ మంచి శకునములే!

Published Mon, Dec 8 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

అన్నీ మంచి శకునములే!

అన్నీ మంచి శకునములే!

 ‘‘శ్రీ శుభ శ్వేత ఫిలిమ్స్ సంస్థ మొదలుపెట్టాక మేం తొలుత విడుదల చేస్తున్న సినిమా ఇదే. ఏ ముహూర్తాన ఈ కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేశామో కానీ... అన్నీ మంచి శకునములే’’ అని సి.కల్యాణ్ అన్నారు. హన్సిక, లక్ష్మీరాయ్, ఆండ్రియా, సుందర్.సి ముఖ్య తారలుగా తమిళంలో రూపొందిన చిత్రం ‘అరణ్మణై’. ఈ చిత్రం ‘చంద్రకళ’గా తెలుగులో విడుదల కానుంది. శ్వేతలాన, వరుణ, తేజ, సి.వి.రావు నిర్మాతలు. సి.కల్యాణ్ ఈ చిత్రానికి సమర్పకుడు.
 
 నేడు సి.కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ నెల 19న సినిమాను విడుదల చేయనున్నట్లు సి.కల్యాణ్ తెలిపారు. చెన్నయ్‌లో ‘అరణ్మణై’ సినిమా పోస్టర్ చూడగానే తనకు ‘అరుంధతి’ సినిమా గుర్తొచ్చిందనీ, ఈ సినిమాను తెలుగులో తానే అనువదించాలనుకున్నానని నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి చెప్పారు. దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాతలు కొడాలి వెంకటేశ్వరరావు, వజ్జా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement