'అరణ్మణై 5' ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ | Kushboo Comments On Aranmanai 5 | Sakshi
Sakshi News home page

'అరణ్మణై 5' ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

Published Sun, Oct 27 2024 8:58 AM | Last Updated on Sun, Oct 27 2024 10:28 AM

Kushboo Comments On Aranmanai 5

హాలీవుడ్‌ తరహాలో దక్షిణాదిలో ఫ్రాంఛైంజీస్‌ కథా చిత్రాలు ఎక్కువగా హిట్‌ అయ్యింది లేదు. అయితే దాన్ని దర్శకుడు సుందర్‌.సి సాధ్యం చేశారు. ఆయన ఎంచుకున్న హార్రర్‌ కామెడీ బ్యానర్‌ బాగా కలిసొచ్చిందని చెప్పక తప్పదు. ఈయన ఈ బ్యానర్‌లో అరణ్మణై పేరుతో ఇప్పటి వరకూ 4 సీక్వెల్స్‌ చేశారు. ఇవన్నీ సూపర్‌ హిట్టే . చివరిగా ఈయన తెరకెక్కించిన అరణ్మణై 4 (బాకు) చిత్రం ఇటీవల విడుదలై రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇందులో  నటి తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా.. సుందర్‌.సి  ప్రధాన పాత్రలో మెప్పించారు. అయితే, అరణ్మణై5 షూటింగ్‌ ప్రారంభమైందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు.

అరణ్మణై5 ప్రాజెక్ట్‌ గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా ఫేక్‌ అని ఆమె చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి తామె ఎలాంటి పోస్టర్స్‌ విడుదల చేయలేదని ఆమె తెలిపారు. ఇవ్వన్నీ రూమర్సే అంటూ చెప్పుకొచ్చారు. పార్ట్‌5 గురించి తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అరణ్మణై5 ప్లాన్‌ చేసినప్పుడు స్వయంగా వెల్లడిస్తామని, అప్పటి వరకు వేచిఉండాలని ఖుష్బూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. 

2014లో విడుదలైన 'అరణ్మణై' మంచి విజయం అందుకోవడంతో  దానికి సీక్వెల్‌గా 2016,2021,2024లో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 'అరణ్మణై4' ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. సుందర్‌.సి డైరెక్టర్‌గా  నయనతార ప్రధాన పాత్రలో మూక్కుత్తి అమ్మన్‌ 2 (అమ్మోరు తల్లి2) చిత్రాన్ని చేస్తున్నారు. వడివేలుతో కలిసి గ్యాంగ్‌స్టర్స్‌ అనే మరో చిత్రాన్ని కూడా ఆయన తెరకెక్కిస్తున్నారు. అలాగే సుందర్‌.సి హీరోగా నటిస్తున్న ఒన్‌ 2 ఒన్‌, వల్లన్‌ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement