అదంతా అసత్య ప్రచారం | hansika motwani Role rumors Aranmanai | Sakshi
Sakshi News home page

అదంతా అసత్య ప్రచారం

Published Thu, Dec 11 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

అదంతా అసత్య ప్రచారం

అదంతా అసత్య ప్రచారం

నటి హన్సిక నటించిన తాజా చిత్రం మెగామాన్ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి మగిళ్ తిరువేణి దర్శకుడు. ఈ చిత్రంలో హన్సిక పోషిం చిన పాత్రపై పలు రకాల ప్రచారాలు హల్‌చల్ చేస్తున్నాయి. హన్సిక హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన అరణ్మణై చిత్రంతో సహా వరుస విజయాలను అందుకుంటున్న నటి హన్సిక. అదే విధంగా విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. వ్యక్తిగతంగా కూడా పలువురు పిల్లలను దత్తత తీసుకోవడం వంటి పలు సేవా కార్యక్రమాలతో మంచి ఉదార స్వభావం గల నటిగా పేరు తెచ్చుకున్నారు.
 
 అలాంటి నటి మెగామాన్ చిత్రంలో పోషించిన పాత్ర చిన్న పిల్లలు మెచ్చేదిగా ఉండకపోవడమే కాకుండా వారిని భయపెట్టేదిగాను, ఆమె వ్యక్తిగతానికి పూర్తి విరుద్దమైనది గాను ఉంటుందనే ప్రచారం సోషల్‌నెట్ వర్క్స్‌లో జోరందుకుంది. దీనికి స్పందించిన హన్సిక అదంతా అసత్య ప్రచారం అని కొట్టి పారేశారు. తాను మెగామాన్ చిత్రంలో హీరోయిన్‌గా నటించానని తెలిపారు. దీన్ని ఎవరో కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. మెగామాన్ చిత్రం ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రం అని అలాంటి చిత్రంలో పిల్లలను భయపెట్టే పాత్రగా తనకెందుకుంటుందని హన్సిక ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement