హన్సిక షూటింగ్‌లో దెయ్యం? | Hansika Motwani goes totally desi in 'Aranmanai' | Sakshi
Sakshi News home page

హన్సిక షూటింగ్‌లో దెయ్యం?

Published Sun, May 18 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

హన్సిక షూటింగ్‌లో దెయ్యం?

హన్సిక షూటింగ్‌లో దెయ్యం?

దెయ్యాలున్నాయా లేవా అన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే హన్సిక షూటింగ్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. దెయ్యూలపై చాలామంది దర్శకులు చిత్రాలు తెరకెక్కించే స్తూ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం అరణ్మనై. సుందర్ సి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియ, లక్ష్మీరాయ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాస్యనటుడు సంతానం కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌లో నిజ దెయ్యం వినికిడి చేసిందే అంశం నెట్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంపై దర్శకుడు సుందర్ సి స్పందిస్తూ తన చిత్రాల్లో కథ పెద్దగా ఉండదు. కామెడీ మాత్రం ఫుల్‌గా ఉంటుందని తెలిపారు.
 
 సాధారణంగా మహిళలు, పిల్లలు టీవీల్లో దెయ్యం చిత్రాలనే ఆసక్తిగా చూస్తున్నారన్నారు. అందుకే దెయ్యాల నేపథ్యంలో రూపొందిన చంద్రముఖి, కాంచన వంటి చిత్రాలు పెద్ద విజయం సాధించాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరహాలో రూపొందిస్తున్న హార్రర్ చిత్రమే అరణ్మనై అని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ను హైదరాబాద్‌లో వేసిన ఒక బూత్‌బంగ్లా సెట్‌లో అధికభాగం నిర్వహించామని చెప్పారు. ఒక సన్నివేశాన్ని చిన్న పిల్లాడు ఎదురుగా ఎవరు లేకుండానే తనలో తానే మాట్లాడుకుంటాడన్నారు. ఆ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఎవరో పెద్దగా నిట్టూర్చిన శబ్దం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటర్ గ్రహించారని తెలిపారు. అయితే అది నిజ దెయ్యం చర్యనా లేక ఏదైనా శబ్దమా? అన్నది తెలియలేదన్నారు. దీనికి ఆధారం మాత్రం తన వద్ద ఉందని దర్శకుడు సుందర్ సి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement