అతీంద్రియ శక్తులతో...
అతీంద్రియ శక్తులతో...
Published Tue, Feb 11 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
మాయలెరిగిన నాయిక అనగానే, ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’లో శ్రీదేవే గుర్తొస్తారు. ఆ సినిమాలో ఆమె ఇంద్రజ. తనకున్న అతీంద్రియ శక్తులతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేశారు శ్రీదేవి. అలాంటి పాత్రనే ఇప్పుడు హన్సిక పోషిస్తున్నారు. అయితే... శ్రీదేవిలా దివి నుంచి భువికి దిగే పాత్ర కాదు హన్సికది. భువిపైనే పుట్టిన దేవకుమార్తె అన్నమాట. తనకున్న దైవశక్తులతో రోగాలను నయం చేసేస్తుంటుంది. భవిష్యత్తులో జరగబోయేది కూడా చెప్పేస్తుంటుంది.
ఇంతకీ ఏ సినిమాలో హన్సిక ఇలా కనిపించేది? అనేగా మీ ప్రశ్న. అది తెలుగు సినిమా కాదు. తమిళ సినిమా. సుందర్.సి నటిస్తూ... దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు ‘అరణ్‌మణై’. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ పాత్ర ఇదని చెబుతున్నారు హన్సిక. ఇటీవల ఈ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ -‘‘సుందర్‌సార్ కథ చెప్పినప్పుడు భిన్నంగా అనిపించింది. నా కెరీర్‌లో ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇది భిన్నమైన పాత్ర. అడుగడుగునా మలుపులతో నా పాత్రను డిజైన్ చేశారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు హన్సిక.
Advertisement
Advertisement