విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం ‘యాక్షన్’. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం దీపావళి సందర్భంగా విడుదల చేసింది. టర్కీ, అజర్‌బైజాన్‌లో విశాల్, తమన్నా కలిసి విలన్లను పట్టుకునేందుకు చేస్తున్న సాహసాలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. యాక్షన్ సీన్స్‌లో విశాల్‌తో సహా తమన్నా కూడా అదరగొట్టిందంటూ యాక్షన్ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం టర్కీలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో భాగంగా విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే.
ఇక తమిళంలో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలవడం పట్ల విశాల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా విశాల్- సుందర్. సి కాంబినేషన్లో ఇంతకుముందు ‘అంబల, మదగజరాజా’ అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment