విశాల్‌తో మరోసారి..! | Tamannaah to Team up With Vishal Again | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 27 2019 8:37 AM | Last Updated on Sun, Jan 27 2019 8:37 AM

Tamannaah to Team up With Vishal Again - Sakshi

విశాల్‌తో మిల్కీబ్యూటీ మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోందా? దీనికి కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయనే ప్రచారం హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన కన్నెకలైమానే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలాకాలంగా విడుదల కోసం ఎదురుచూస్తోంది.

అయితే ఈ చిత్రానికి ఇప్పుడు టైమ్‌ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తమన్నా తమిళంలో నటించిన చివరి చిత్రం అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌. శింబుతో జత కట్టిన ఈ చిత్రం ఫ్లాప్‌ అవడంతో తమన్నాను కోలీవుడ్‌ పక్కన పెట్టిందనే అనుకున్నారు. అలాంటిది ప్రస్తుతం ఈ జాణ ప్రభుదేవాతో దేవి–2లో రొమాన్స్‌ చేస్తోంది. తాజాగా మరో అవకాశం తమన్నా తలుపు తట్టిందనే టాక్‌ వినిపిస్తోంది.

నటుడు విశాల్‌తో మరోసారి జత కట్టబోతోందని సమాచారం. విశాల్‌ ప్రస్తుతం అయోగ్య చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.ఈ చిత్ర షూటింగ్‌ ఫిబ్రవరిలో పూర్తి చేసుకుంటుంది. దీంతో విశాల్‌ తదుపరి సుందర్‌.సీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పుటికే రెండు చిత్రాలు రూపొందాయన్నది గమనార్హం. అయితే అందులో తొలి చిత్రం మదగజరాజా ఇప్పటికీ తెరపైకి రాలేదు. ఇక అంబల చిత్రం విడుదలై సక్సెస్‌ అయ్యింది. తాజాగా మూడోసారి కలుస్తున్న విశాల్, సుందర్‌.సీ కూటమిలో తమన్నా చేరనుందని తెలిసింది. ఈ చిత్ర షూటింగ్‌ మార్చి నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. తమన్నా ఇంతకు ముందు సండైకత్తి చిత్రంలో విశాల్‌తో రొమాన్స్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement