తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: త‌మిళ డైరెక్ట‌ర్‌ | Sundar C Reveals He Took a Revenge from a Telugu Filmmakers for Copying his Films | Sakshi
Sakshi News home page

త‌మిళ చిత్రాల‌ను తెలుగులో కాపీ కొట్టారు.. అందుకే ప్ర‌తీకారంతో..

Published Thu, May 2 2024 7:37 PM | Last Updated on Thu, May 2 2024 7:53 PM

Sundar C Reveals He Took a Revenge from a Telugu Filmmakers for Copying his Films

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో సుంద‌ర్ సి పేరు మోసిన ద‌ర్శ‌కుడు. అత‌డు తెర‌కెక్కించిన‌ అర‌ణ్మ‌నై 4 సినిమా మే 3న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు సుంద‌ర్‌. ఈ సంద‌ర్భంగా అత‌డు ఓ ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. 

ఈ రేంజ్‌లో కాపీ కొడ‌తారా?
సుంద‌ర్ మాట్లాడుతూ.. నేను ఓ తెలుగు సినిమా చూసి షాక‌య్యాను.  నేను తీసిన సినిమాలోని కంటెంట్‌నే కాపీ కొట్టారు. మరో నాలుగు మూవీస్ చూశాను.. అందులో కూడా త‌మిళ సినిమాల వాస‌న‌లు క‌నిపించాయి. ఈ రేంజ్‌లో కాపీ కొడ‌తారా? అని ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకున్నాను. ఎనిమిది తెలుగు సినిమాల‌ను కాపీ కొట్టి మిక్స్ చేసి విన్న‌ర్ (2003) మూవీ తెర‌కెక్కించాను అని చెప్పుకొచ్చాడు. 

ఆ సినిమాలేంట‌న్న‌వి మాత్రం..
అయితే ఆ సినిమాలేంట‌న్న‌వి మాత్రం ప్ర‌స్తావించ‌లేదు. ఇక‌పోతే అరుణ్మ‌నై మూవీలో సుంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు. త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం తెలుగులో బాక్ పేరిట విడుద‌ల కానుంది. ఇందులో యోగి బాబు, కోవై సర‌ళ‌, సంతోష్ ప్ర‌తాప్ ముఖ్య పాత్ర‌లు పోషించారు.

చ‌ద‌వండి: 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం హాలీవుడ్‌ ఆఫర్‌ వదులుకున్న రాజమౌళి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement