వాళ్లే టార్గెట్‌.. బీ కేర్‌ఫుల్‌.. వైరలవుతోన్న బ్రహ్మజీ ట్వీట్! | Actor Brahmaji Reveals About Scam In The Name Of Lokesh Kanagaraj Manager In Industry, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Brahmaji Viral Tweets: సినీరంగంలో సరికొత్త మోసం.. వారంతా జాగ్రత్త: బ్రహ్మజీ వార్నింగ్

Oct 5 2023 1:15 PM | Updated on Oct 5 2023 1:54 PM

Tollywood Actor Brahmaji Tweet Fraud In Cinema Industry Goes Viral - Sakshi

ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రతి రోజు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. చదవుకున్న వాళ్లు సైతం సైబర్‌ ఉచ్చులో పడి లక్షల్లో మోసపోతున్న సంఘటనలు చూశాం. అయితే సినీ తారలు సైతం వీరి మోసాల పడుతూనే ఉన్నారు. సైబర్ ‍మోసాలు పెరుగుతున్న ఈ రోజుల్లో.. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌ తెగ వైరలవుతోంది. సైబర్ తరహాలో సినీ రంగంలో జరుగుతున్న సరికొత్త దోపిడీని తెరపైకి తీసుకొచ్చారు. సినిమా అవకాశాల పేరిట మోసగిస్తున్నారంటూ అలాంటి వారి వివరాలను ట్వీట్‌లో ప్రస్తావించారు. 

(ఇది చదవండి: ఆ హీరోతో తొలిసారి జోడీ కడుతున్న నిత్యామీనన్‌..)

బ్రహ్మజీ ట్వీట్‌లో రాస్తూ..' అందరికీ హెచ్చరిక.. ఈ సెల్ ‍నంబర్‌(78268 63455 ) డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ మేనేజర్‌ నంబర్‌లా ఉంటుంది. అతని పేరు నటరాజ్ అన్నాదురై. అతను కాల్‌ చేసి.. సార్ నేను లోకేశ్ మేనేజర్‌ను. మీ ప్రొఫైల్ ఆయన తదుపరి సినిమా కోసం ఎంపిక చేయబడింది. ఈ సినిమా కోసం కాస్ట్యూమ్‌లు అవసరమవుతాయి. ఆడిషన్‌ కాస్టూమ్స్‌ కోసం మీరు డబ్బులు చెల్లించండి. ఆడిషన్స్ అయ్యాక మీరు చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామని అంటారు. ప్రస్తుతం ఇది చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న కొత్త తరహా మోసం.. అబ్బాయిలు జాగ్రత్త..' అంటూ షేర్ చేశారు. 

అంతేకాకుండా ఆ వ్యక్తిలాగే ఇంకొకరు ఉన్నారంటూ ఫోన్ నెంబర్ వివరాలతో సహా బ్రహ్మజీ ట్వీట్ చేశారు. సత్యానంద్‌(90877 87999) అనే వ్యక్తి సినిమాల్లోకి రావాలనుకునే వారే లక్ష్యంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారంటూ తెలిపారు. అతన ఓ ప్రముఖ సంస్థ జర్నలిస్ట్‌లా చెప్పుకుంటూ మోసాలకు చేస్తున్నారని.. ఇలాంటి వారి పట్ల బీ కేర్‌ఫుల్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మజీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: బిగ్‌ బాస్‌ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement