సుందర్ సి దర్శకత్వంలో రజనీ | Directed by Sundar C | Sakshi
Sakshi News home page

సుందర్ సి దర్శకత్వంలో రజనీ

Published Thu, Apr 9 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

సుందర్ సి దర్శకత్వంలో  రజనీ

సుందర్ సి దర్శకత్వంలో రజనీ

 సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డెరైక్ట్ చేయడానికి సుందర్ సి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా. ఈ చిత్రం రిజల్ట్స్ ఎలా వున్నా ఆయనకు మాత్రం భరించలేనంత తలనొప్పిని కలిగించిందని చెప్పక తప్పదు. సూపర్‌స్టార్ తదుపరి చిత్రం ఏమిటన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే రజనీ తాజా చిత్రం గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. శంకర్ ఎందరిన్-2 కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయమై ఇటు శంకర్ నుంచి గానీ అటు రజనీకాంత్ తరపు నుంచి గాని ఎలాంటి సమాచారం లేదు.
 
 అదే విధంగా కె ఎస్వ్రికుమార్, ఎ ఆర్ మురుగదాస్, శంకర్ ఎవరో ఒకరు రజనీ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో లేటెస్ట్‌గా సుందర్ సి రజనీకాంత్‌ను దర్శకత్వం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం తెరపైకొచ్చింది. వీరిద్దిరి కాంబినేషన్‌లో 1997లో అరుణాచలం చిత్రం రూపొంది ఘన విజయం సాధించింది. సుమారు 18 ఏళ్ల తరువాత సూపర్‌హిట్ కాంబినేషన్‌లో ఒక చిత్రం రానుందంటే సూపర్‌స్టార్ అభిమానులకు సంతోషకరమైన వార్తే అవుతుంది.
 
  రజనీ ఇటీవల సీరియస్‌తో కూడిన యాక్షన్ కథా చిత్రాలు చేశారు. అందువలన ఇప్పుడు పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన కమర్షియల్ చిత్రం చేయాలని ఆశిస్తున్నట్లు సమాచారం. ఆ తరహా చిత్రాలు చేయడంలో సుందర్ సి సిద్ధహస్తుడు. అందుకే తన తదుపరి చిత్ర బాధ్యతలను రజనీ ఆయనకు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం వున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement