ఏ విభాగానికి చెందిన కథా చిత్రాన్ని అయినా తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను అలరింపచేసే దర్శకుడు సుందర్ సీ. ఇటీవల అరణ్మణై –3 చిత్రంతో హిట్ కొట్టిన ఈయన తాజాగా కాఫీ విత్ కాదల్ చిత్రంతో వినోదం పెంచడానికి సిద్ధం అవుతున్నారు. అవ్నీ సినీ మ్యాక్స్, కుష్భు బెంజ్ మీడియా ఏసీఎస్ అరుణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జీవా, శ్రీకాంత్, జయ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ, రైసా విల్సన్, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం ఆగస్టులో తెరపైకి రానుంది. కాగా కమలహాసన్, కుష్భు నటించిన మైఖేల్ మదన కామరాజ్ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, చిత్ర పాడిన రంభంభం...ఆరంభం పాటను కాఫీ విత్ కాదల్ చిత్రం కోసం రీమిక్స్ చేసినట్లు దర్శకుడు తెలిపారు.
చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్
పెళ్లిళ్లు బాధాకరంగా ఉండేందుకు మీరే కారణం: సమంత
Comments
Please login to add a commentAdd a comment