అరణ్మణై సీక్వెల్‌లో ఆ ముగ్గురూ | Kajal, Trisha and Hansika in one film? | Sakshi
Sakshi News home page

అరణ్మణై సీక్వెల్‌లో ఆ ముగ్గురూ

Published Sun, May 10 2015 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

అరణ్మణై సీక్వెల్‌లో ఆ ముగ్గురూ

అరణ్మణై సీక్వెల్‌లో ఆ ముగ్గురూ

చిత్ర పరిశ్రమలో ఒక్కో సీజన్‌లో ఒక్కో ట్రెండ్ నడుస్తుందనే వారి మాటల్ని కొట్టిపారేయలేము. అలా ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాల హవా సాగుతోందని చెప్పవచ్చు. అలాగే సీక్వెల్ సీజన్ నడుస్తోందన్నది గమనార్హం. తమిళంలో మునికి సీక్వెల్‌గా లారెన్స్ తెరకెక్కించిన రెండు చిత్రాలు (కాంచన, కాంచన-2) చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. యామెరుక్క భయమే చిత్రం విజయం సాధించింది. దీనికి సీక్వెల్ రూపొందిస్తానంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు, కాగా సుందర్ సి దర్శకత్వం వహించిన అరణ్మణై చిత్రం హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపు తెరకెక్కనుంది. విశేషం ఏమిటంటే ఇవన్నీ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాలే. ఇక అరణ్మణై చిత్ర విషయానికొస్తే సుందర్ సి దర్శకత్వం వహించి, ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియా, రాయ్‌లక్ష్మి అంటూ ముగ్గురు హీరోయిన్లు నటించారు. దీన్ని నటి కుష్భు తన అల్కి సినీ మాక్స్ పతాకంపై నిర్మించారు. గత ఏడాది తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రజాదరణను పొందింది.
 
 సీక్వెల్‌కు సిద్ధం : కాగా ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సుందర్ సి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంతో సిద్ధార్థ్ హీరోగా నటించనున్నారని సమాచారం. ఆయనకు జంటగా నటి త్రిష నటించనున్నట్టు ఇప్పటికే ఆమె తన ట్విట్టర్‌లో వెల్లడించారు. తన డార్లింగ్ కుష్భు నిర్మించే చిత్రంలో తాను నటించనుండడం సంతోషంగా ఉందని త్రిష పేర్కొన్నారు. తాజాగా అరణ్మణై చిత్రంలో నటించిన హన్సిక దానికి కొనసాగింపులోను నటించనున్నారట. ఈ విషయం గురించి కుష్భు తన ట్విట్టర్‌లో పేర్కొంటై అరణ్మణై-2లో హన్సిక లేకపోతే ఆ చిత్రం పరిపూర్ణం కాదని అన్నారు. హన్సిక కూడా తన ఫేవరెట్ దర్శకుడు చిత్రంలో నటించనుండ డం సంతోషంగా ఉందని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
 
  ఇప్పటికే ఆమె సుందర్ సి దర్శకత్వంలో తీయవిలై సెయ్యనుమ్ కుమారా, అరణ్మణై, ఆంబళ చిత్రంలో నటించారు. ఈ మూడు చిత్రాలు సక్సెస్ అయ్యాయన్నది గమనార్హం. ఇప్పుడు నాలుగోసారి నటించడానికి హన్సిక సిద్ధం అవుతున్నారన్నమాట. కాగా అరణ్మణై చిత్రంలో మాదిరిగానే దాని సీక్వెల్ చిత్రంలోను ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఆ మూడవ హీరోయిన్ నటి కాజల్ అగర్వాల్‌ను నటింపచేయాలని సుందర్ సి భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమెతో చర్చించడానికి సుందర్ సి రెడీ అవుతున్నట్లు సమాచారం. అరణ్మణై చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని యూనిట్ వర్గాలు తెలిపారు. సుందర్ సి చిత్రాలంటే హాస్యం అలరించే స్థాయిలో ఉంటుంది. అది ఈ కొనసాగింపులో కాస్త అధికంగానే ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement