Aranmanai 2
-
అలాంటి పాత్రల వల్ల హీరోయిన్లకు లాభం లేదు!
‘‘నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామరస్ రోల్ చేయడానికి నేను రెడీ. కానీ, తెలుగు పరిశ్రమలో నాకు ఎక్కువగా ఆఫ్ బీట్ పాత్రలే వస్తున్నాయి. ఒకటీ, రెండు అయితే అలాంటివి చేయొచ్చు. అలాగే ఐటమ్ సాంగ్స్ కూడా ఒకటీ, రెండైతే ఫర్వాలేదు కానీ.. వరుసగా చేయలేను’’ అని పూనమ్ బజ్వా అన్నారు. సిద్ధార్థ్, త్రిష, హన్సిక కాంబినేషన్లో ఆమె నటించిన ‘కళావతి’ ఈ నెల 29న విడుదల కానుంది. సుందర్ సి. దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 2’ని ‘కళావతి’ పేరుతో గుడ్ సినిమా గ్రూప్ అనువదించింది. ఈ చిత్రం గురించి, ఇతర విశేషాలను పూనమ్ ఈ విధంగా పంచుకున్నారు. ♦ నాలుగు పాటలు, రెండు రొమాంటిక్ సన్నివేశాలు, ఓ లవ్ ట్రాక్ ఉన్న సినిమాల్లో నటించడం వల్ల హీరోయిన్లకు ఎటువంటి లాభం లేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తేనే గుర్తింపు ఉంటుంది. అటువంటి పాత్రలే నేను అంగీకరిస్తున్నా. ‘కళావతి’లో నా పాత్ర ఆ కోవకి చెందినదే. ఇందులో నాది నర్సు పాత్ర. హీరోయిన్గా మంచి మార్కులు పడాలంటే సుందర్.సి దర్శకత్వంలో నటించాల్సిందే. ఇందులో సిద్ధార్థ్‌కి, నాకూ మంచి సీన్లు, ఓ పాట ఉన్నాయి. నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో ఉన్నప్పటికీ ఎవరి ప్రాధాన్యం వారికి ఉంటుంది. నాకు చీకటన్నా, దెయ్యాలన్నా భయం. చిత్రీకరణలో పాల్గొన్నప్పుడు యూనిట్ సభ్యులు ఉంటారు కాబట్టి, ధైర్యంగా చేసేశా. భయపెడతూ నవ్వించే చిత్రం ఇది. కాజల్, నేనూ ఒకేసారి కెరియర్ ప్రారంభించాం. కథానాయికగా ఆమెతో పోలిస్తే నేనంత కష్టపడలేదు. అయినా దక్షిణాది చిత్రాలతో నేనూ బిజీగానే ఉన్నా. నాతో పాటు కెరియర్ ప్రారంభించిన చాలామంది ఇప్పుడు కనిపించడం లేదు. తెలుగు సినిమాతో నా కెరియర్ ప్రారంభమైంది. అందుకే తెలుగంటే నాకు సెంటిమెంట్. మంచి పాత్రలొస్తే చేయడానికి రెడీ! -
'లవ్‌లో లేనందుకు లక్కీ'
స్టార్ హీరోయిన్‌తో బ్రేక్ అప్, ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో డీలా పడిపోయిన యంగ్ హీరో సిద్దార్ధ్ తిరిగి ఫాంలోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రస్తుతం రెండు విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సిద్ధు ప్రస్తుతానికి ప్రేమలో లేనందుకు లక్కీ అంటున్నాడు. ముఖ్యంగా సమంతతో బ్రేక్ అప్ తరువాత మీడియాకు దూరంగా ఉంటున్న సిద్దార్ధ్, ఇటీవల చెన్నై వరదల నేపథ్యంలో తిరిగి అందుబాటులోకి వచ్చాడు. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించిన జిల్ జంగ్ జక్ సినిమాతో పాటు, సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన అరణ్మణై 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న ఈ చాక్లెట్ భాయ్, ఈ రెండు సినిమాలతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే ఇంట్రస్టింగ్ కామెంట్స్ తన సినిమాల ప్రమోషన్‌కు తన వంతు సాయం చేస్తున్నాడు. మరి లవ్‌లో లేనందుకు లక్కీ అంటున్న సిద్ధూకి సక్సెస్ వస్తుందో లేదో చూడాలి. -
సినిమా కోసం 103 అడుగుల విగ్రహం
సౌత్ సినిమాకు సక్సెస్ ఫార్ములాగా మారిన హార్రర్ సినిమా ఇప్పుడు మరింత గ్రాండ్ రెడీ అవుతుంది. ఇప్పటి వరకు మినిమమ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలను ఇప్పుడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ హర్రర్ కామెడీ సినిమా అరన్మణై సీక్వల్‌ను బిగ్ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం ఆసియాలోనే ఎతైన అమ్మవారి విగ్రహాన్ని నిర్మించారు. సినిమాలో ఓ కీలక సన్నివేశంలో వచ్చే అమ్మవారి భారీ విగ్రహాన్ని తొలుత గ్రాఫిక్స్ లో క్రియేట్ చేయాలని భావించినా, క్వాలిటీ పరంగా ఆకట్టుకోదేమో అన్న ఆలోచనతో 103 అడుగుల ఎత్తుతో విగ్రహం సెట్ వేయాడానికి నిర్ణయించుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గురురాజ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పాటు, స్కెలిటన్స్ వాడి ఈ భారీ విగ్రహాన్ని రూపొందిచాడు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 40 రోజులు సమయం పట్టిందని, విగ్రహాం తయారు చేసే సమయంలో ఎంతో నిష్ఠగా ఉపవాసాలు ఉండి మరి తయారు చేశామన్నారు. హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కి ఘనవిజయం సాదించిన అరన్మణై సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న అరన్మణై 2లో సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నాడు. హన్సికతో పాటు త్రిష, సూరి, పూనమ్ బాజ్వాలు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. దర్శకుడు సుందర్.సి భార్య కుష్బు ఈ సినిమాను నిర్మిస్తుంది. -
అరణ్మణై సీక్వెల్లో ఆ ముగ్గురూ
చిత్ర పరిశ్రమలో ఒక్కో సీజన్లో ఒక్కో ట్రెండ్ నడుస్తుందనే వారి మాటల్ని కొట్టిపారేయలేము. అలా ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాల హవా సాగుతోందని చెప్పవచ్చు. అలాగే సీక్వెల్ సీజన్ నడుస్తోందన్నది గమనార్హం. తమిళంలో మునికి సీక్వెల్‌గా లారెన్స్ తెరకెక్కించిన రెండు చిత్రాలు (కాంచన, కాంచన-2) చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. యామెరుక్క భయమే చిత్రం విజయం సాధించింది. దీనికి సీక్వెల్ రూపొందిస్తానంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు, కాగా సుందర్ సి దర్శకత్వం వహించిన అరణ్మణై చిత్రం హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపు తెరకెక్కనుంది. విశేషం ఏమిటంటే ఇవన్నీ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాలే. ఇక అరణ్మణై చిత్ర విషయానికొస్తే సుందర్ సి దర్శకత్వం వహించి, ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియా, రాయ్‌లక్ష్మి అంటూ ముగ్గురు హీరోయిన్లు నటించారు. దీన్ని నటి కుష్భు తన అల్కి సినీ మాక్స్ పతాకంపై నిర్మించారు. గత ఏడాది తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రజాదరణను పొందింది. సీక్వెల్‌కు సిద్ధం : కాగా ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సుందర్ సి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంతో సిద్ధార్థ్ హీరోగా నటించనున్నారని సమాచారం. ఆయనకు జంటగా నటి త్రిష నటించనున్నట్టు ఇప్పటికే ఆమె తన ట్విట్టర్లో వెల్లడించారు. తన డార్లింగ్ కుష్భు నిర్మించే చిత్రంలో తాను నటించనుండడం సంతోషంగా ఉందని త్రిష పేర్కొన్నారు. తాజాగా అరణ్మణై చిత్రంలో నటించిన హన్సిక దానికి కొనసాగింపులోను నటించనున్నారట. ఈ విషయం గురించి కుష్భు తన ట్విట్టర్లో పేర్కొంటై అరణ్మణై-2లో హన్సిక లేకపోతే ఆ చిత్రం పరిపూర్ణం కాదని అన్నారు. హన్సిక కూడా తన ఫేవరెట్ దర్శకుడు చిత్రంలో నటించనుండ డం సంతోషంగా ఉందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆమె సుందర్ సి దర్శకత్వంలో తీయవిలై సెయ్యనుమ్ కుమారా, అరణ్మణై, ఆంబళ చిత్రంలో నటించారు. ఈ మూడు చిత్రాలు సక్సెస్ అయ్యాయన్నది గమనార్హం. ఇప్పుడు నాలుగోసారి నటించడానికి హన్సిక సిద్ధం అవుతున్నారన్నమాట. కాగా అరణ్మణై చిత్రంలో మాదిరిగానే దాని సీక్వెల్ చిత్రంలోను ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఆ మూడవ హీరోయిన్ నటి కాజల్ అగర్వాల్‌ను నటింపచేయాలని సుందర్ సి భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమెతో చర్చించడానికి సుందర్ సి రెడీ అవుతున్నట్లు సమాచారం. అరణ్మణై చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని యూనిట్ వర్గాలు తెలిపారు. సుందర్ సి చిత్రాలంటే హాస్యం అలరించే స్థాయిలో ఉంటుంది. అది ఈ కొనసాగింపులో కాస్త అధికంగానే ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు.