సినిమా కోసం 103 అడుగుల విగ్రహం | 103 feet tall statue for aranmanai 2 | Sakshi
Sakshi News home page

సినిమా కోసం 103 అడుగుల విగ్రహం

Published Fri, Sep 25 2015 1:36 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

సినిమా కోసం 103 అడుగుల విగ్రహం

సినిమా కోసం 103 అడుగుల విగ్రహం

సౌత్ సినిమాకు సక్సెస్ ఫార్ములాగా మారిన  హార్రర్ సినిమా ఇప్పుడు మరింత గ్రాండ్ రెడీ అవుతుంది. ఇప్పటి వరకు మినిమమ్ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలను ఇప్పుడు భారీ బడ్జెట్తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ హర్రర్ కామెడీ సినిమా అరన్మణై సీక్వల్ను బిగ్ బడ్జెట్తో రూపొందించనున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం ఆసియాలోనే ఎతైన అమ్మవారి విగ్రహాన్ని నిర్మించారు.

సినిమాలో ఓ కీలక సన్నివేశంలో వచ్చే అమ్మవారి భారీ విగ్రహాన్ని తొలుత గ్రాఫిక్స్ లో క్రియేట్ చేయాలని భావించినా, క్వాలిటీ పరంగా ఆకట్టుకోదేమో అన్న ఆలోచనతో 103 అడుగుల ఎత్తుతో విగ్రహం సెట్ వేయాడానికి నిర్ణయించుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గురురాజ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో పాటు, స్కెలిటన్స్ వాడి ఈ భారీ విగ్రహాన్ని రూపొందిచాడు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 40 రోజులు సమయం పట్టిందని, విగ్రహాం తయారు చేసే సమయంలో ఎంతో నిష్ఠగా ఉపవాసాలు ఉండి మరి తయారు చేశామన్నారు.

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కి ఘనవిజయం సాదించిన అరన్మణై సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న అరన్మణై 2లో సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నాడు. హన్సికతో పాటు త్రిష, సూరి, పూనమ్ బాజ్వాలు ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. దర్శకుడు సుందర్.సి భార్య కుష్బు ఈ సినిమాను నిర్మిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement