తేనెటీగ కుట్టినా షూటింగ్ ఆపలేదు | Hansika Motwani Gets Stung by Bee while Shooting for 'Aambalai' | Sakshi
Sakshi News home page

తేనెటీగ కుట్టినా షూటింగ్ ఆపలేదు

Published Sun, Oct 19 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

తేనెటీగ కుట్టినా షూటింగ్ ఆపలేదు

తేనెటీగ కుట్టినా షూటింగ్ ఆపలేదు

చిన్న చీమ కుడితేనే చిమచిమలాడుతుంది. అలాంటి తేనెటీగ కుడితే అమ్మో అది యమబాధనే. అలాంటి తేనెటీగ అందమైన హీరోయిన్‌ను కుడితే ఇంకేమైనా ఉందా? ప్రథమ చికిత్స, విశ్రాంతి, షూటింగ్‌కు అంతరాయం అంటూ పెద్ద ఇష్యూ అయిపోదు. అలాంటి తేనెటీగ, ముట్టుకుంటే కందిపోయే అందాలభామ హన్సికను కుట్టింది. అయినా పైన చె ప్పినవేవీ జరగలేదు. అయితే బాధను మాత్రం భరించింది ఈ ముద్దుగుమ్మ.  షూటింగ్‌కు మాత్రం అంతరాయం కలగనీయలేదు. బహుభాషా నటి హన్సిక ఒక్క తమిళంలో చేతినిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విశాల్ సరసన ఆంబళ చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఆ అడవి ప్రాంతంలో హన్సిక చేతిపై తేనెటీగ కుట్టిందట.
 
 వెంటనే ప్రథమ చికిత్స అందించినా నొప్పి మాత్రం తగ్గలేదు. ఆ నొప్పిని భరిస్తూనే షూటింగ్‌లో పాల్గొన్నారు. చిత్ర యూనిట్ విశ్రాంతి తీసుకోమని చెప్పినా అదే తగ్గిపోతుందిలే అంటూ షూటింగ్‌కు అంతరాయం కలగకుండా నటించినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెప్పాయి. వృత్తిపై హన్సికకు ఎంత అంకితభావం అంటూ సహచరులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారట. దటీజ్ హన్సిక. మరో విషయం ఏమిటంటే ఈ బ్యూటీ ఆదివారం హైదరాబాద్ వెళ్లి, అక్కడ విశాఖ ప్రాంత వరద బాధితుల కోసం నిధిని సేకరించే కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిసింది. అటు నుంచి హన్సిక ముంబయి వెళ్లి తన దత్తపుత్రిక, పుత్రులతో దీపావళి పండుగ జరుపుకుని వారి జీవితాల్లో సంతోషాన్ని నింపి ఆ తరువాత చెన్నైకు చేరుకుని రోమియో జూలియట్ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement