వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న యంగ్‌హీరో విశాల్.. మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీఅవుతున్నాడు. రీసెంట్ టెంపర్ రీమేక్‌గా తెరకెక్కించిన ఆయోగ్య మూవీతో సూపర్ హిట్ అందుకున్న విశాల్.. మరో ఫుల్‌లెంగ్త్ ‘యాక్షన్’ మూవీతో మన ముందుకు వచ్చేందుకు సిద్దంగాఉన్నాడు.
సుందర్ సి దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమా టీజర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అద్భుతమైన పోరాట సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Proudly Presenting the Teaser of my next Movie, #Action https://t.co/1OXUZpMYvK #ActionTeaser#SundarC @tridentartsoffl @tamannaahspeaks @AishwaryaLeksh4 @iYogiBabu @hiphoptamizha @puri_akanksha @Kabirduhansingh @dudlyraj @johnsoncinepro @Muzik247in
— Vishal (@VishalKOfficial) September 13, 2019
Comments
Please login to add a commentAdd a comment